కియారా అద్వానీతో హీరో సిద్దార్థ్ డేటింగ్ నిజమేనా.. ఆ పార్టీలో ఇద్దరూ..

గత కొన్నేళ్లుగా కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా లు డేటింగ్‌లోఉన్నట్టు బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

బాలీవుడ్‌లో డేటింగ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫ్రెండ్ షిప్ ముసుగులో కూడా డేటింగ్ నడుస్తుంది. అడిగితే క్లోజ్ ఫ్రెండ్స్.. అలాంటిదేం లేదంటారు. కానీ వాళ్లు చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయి.

  • Share this:
బాలీవుడ్‌లో డేటింగ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఫ్రెండ్ షిప్ ముసుగులో కూడా డేటింగ్ నడుస్తుంది. అడిగితే క్లోజ్ ఫ్రెండ్స్.. అలాంటిదేం లేదంటారు. కానీ వాళ్లు చేసే పనులు మాత్రం మరోలా ఉంటాయి. అవి కెమెరాకు తప్పు కనిపిస్తాయా.. లేదంటే మన కళ్లే మనను మోసం చేస్తాయో తెలియదు కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ కళ్ల ముందే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీ బాలీవుడ్ కుర్ర హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉందనే వార్తలు కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇదే విషయం వాళ్లను అడిగితే అలాంటిదేం లేదు.. ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చేసారు. ఇక కియారా అయితే తాను సింగిల్ అని కన్ఫర్మ్ చేసింది.

ఇదిలా ఉంటే జులై 31న కియారా అద్వానీ బర్త్ డే పార్టీ బాంబేలో ఘనంగా జరిగింది. బాలీవుడ్ పెద్దలు కరణ్ జోహార్, షాహిద్ కపూర్ లాంటి వాళ్ళు కూడా ఈ పార్టీకి వచ్చారు. అందులోనే సిద్ధార్థ్ కూడా ఉన్నాడు. పార్టీ అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు కూడా. ఇదే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఒకే కారులో వెళ్లడం తప్పు కాదు కానీ డేటింగ్ చేస్తున్నారు అనే రూమర్ వచ్చిన తర్వాత కూడా కలిసి కనిపిస్తున్నారంటే ఏమనుకోవాలి..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఈ ఇద్దరూ ఇప్పుడు షేర్‌షా సినిమాలో కలిసి నటిస్తున్నారు. 24 ఏళ్ల వయసులోనే కార్గిల్‌లో బలిదానం చేసుకున్న విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: