హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రవితేజ గురించి ఆ న్యూస్ నిజమేనా ?.. స్టార్ హీరో ప్లాన్ మారిందా ?

Ravi Teja: రవితేజ గురించి ఆ న్యూస్ నిజమేనా ?.. స్టార్ హీరో ప్లాన్ మారిందా ?

రవితేజ (Twitter Image)

రవితేజ (Twitter Image)

Raviteja| Chiranjeevi: బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించనుంది. అంతా ఓకే అనుకున్న అనుకుంటుంటే.. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్‌ స్టార్ హీరో రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ క్రేజీ ప్రాజెక్టులే. అయితే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కనున్న వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషించేందుకు ఓకే చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. చిరంజీవి, రవితేజ కాంబినేషన్ కావడంతో.. ఈ సినిమా కూడా ఓ క్రేజీ మల్టీస్టారర్ మూవీ అని అంతా చర్చించుకోవడం మొదలుపెట్టారు. బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రీ మూవీస్ (Mythri Movies) సంస్థ నిర్మించనుంది. అంతా ఓకే అనుకున్న అనుకుంటుంటే.. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా రవితేజ తప్పుకున్నారనే చర్చ నడుస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ (Ravi teja) భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని.. అందుకే సినిమా నుంచి అతడిని పక్కనపెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా కోసం రవితేజ స్థానంలో మరో స్టార్‌ను ఎంపిక చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ సినిమా నుంచి రవితేజను తప్పించడం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఆలోచన ఉందనే ప్రచారం కూడా ఉంది.

ఆచార్య రిజల్ట్ తరువాత తన కొత్త సినిమాలకు సంబంధించి చిరంజీవి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఈ క్రమంలోనే ఈ నయా ప్రాజెక్ట్ నుంచి రవితేజను తప్పించారనే పుకార్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో షికారు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రవితేజ తప్పుకున్నట్టు మూవీ మేకర్ల నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఏదీ రాకపోవడంతో.. ఇది నిజమా లేక ఊహాగానాలేనా అనే విషయం మెగా ఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు.

Sarkaru Vari Pata: మహేశ్ బాబు మీదే ఆశలన్నీ.. ఈ ఏడాది ఆ లోటు తీరుస్తాడా ?

Ram Charan: రామ్‌చరణ్ విషయంలోనే ఎందుకిలా జరుగుతోంది.. తెగ ఫీలవుతున్న ఫ్యాన్స్..

అయితే ప్రస్తుతం చిరంజీవి భార్యతో కలిసి ఫారిన్ వెకేషన్‌కు వెళ్లారు. నెల రోజుల పాటు ఆయన వెకేషన్‌లోనే ఉండనున్నారు. జూన్‌లో తిరిగొచ్చిన తరువాతే ఆయన తన కొత్త సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నారు. ఈలోగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌పై మూవీ మేకర్లు క్లారిటీ ఇస్తారా ? లేదా ? అన్నది చూడాలి.

First published:

Tags: Chiranjeevi, Ravi Teja

ఉత్తమ కథలు