డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రెడ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..

యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ `రెడ్`. ఈ నెల 9న విడుదలకావాల్సివుండగా.. కరోనా వల్ల వాయిదా పడింది.

news18-telugu
Updated: April 12, 2020, 3:14 PM IST
డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి రెడ్.. క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..
రామ్ రెడ్ పోస్టర్ Photo : Twitter
  • Share this:
యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ `రెడ్`. స్రవంతి రవికిషోర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తమిళ హిట్ చిత్రం `తడమ్` కు తెలుగు రీమేక్‌. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్, మాళవిక శర్మ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. కరోనా వల్ల దేశంలో మరణాలతో పాటు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ కాస్తా ఏప్రిల్ 15తో ముగుస్తుందనుకుంటే.. ప్రస్తుతం లాక్ డౌన్‌ను ఏప్రిల్ 30వరకు కొనసాగించారు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే ఆ సినిమా మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో రామ్ 'రెడ్' విడుదల విషయంలో డైలమాలో ఉన్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేయాలని ఓ దశలో రామ్ భావించారని, ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేక డైలమాలో పడ్డారన్నది ఆ వార్త సారాంశం.

ఈ వార్తలపై రామ్ తాజాగా స్పందించాడు. 'నో ప్రాబ్రమ్. రామ్ పోతినేని ఎలాంటి డైలమాలో లేడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, సామాజిక దూరాన్ని పాటిస్తూ, హోమ్ క్వారంటైన్ పాటిస్తూ ఇంట్లోనే ఆనందిస్తున్నాడని' ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన తన సినిమా రెడ్ ఆలస్యమైన థియేటర్స్‌లోనే విడుదలకానుందని స్పష్టం చేశాడు.


First published: April 12, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading