హోమ్ /వార్తలు /సినిమా /

Ram Charan: ఆచార్య సినిమాలో చరణ్ సీన్స్ కట్ చేశారా ?

Ram Charan: ఆచార్య సినిమాలో చరణ్ సీన్స్ కట్ చేశారా ?

Acharya Photo : Twitter

Acharya Photo : Twitter

ఆచార్య ట్రైలర్ చూస్తూ.. రామ్ చరణ్ పాత్ర కూడా కీలకంగా ఉందని.. సినిమాలో రామ్ చరణ్ కూడా ఎక్కువ సేపు కనిపిస్తాడని ఫ్యాన్స్ అంతా సంబరపడ్డారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పాత్ర నిడివి తగ్గిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’(Acharya). ఈ  సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నెల 29న ఆచార్య సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.  దీంతో  మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఆచార్య సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇటీవలే రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మెగా మూవీపై ఇప్పుడు అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

మరోవైపు ఆచార్యలో చిరంజీవి(Chiranjeevi)తో పాటు రామ్ చరణ్(Ram Charan) కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.దీంతో ఆచార్యపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.  ఆచార్య ట్రైలర్‌(Acharya Trailer)లో చరణ్ పాత్రకు సంబంధించిన ఇంట్రో చూసి ప్రేక్షకులు ఈ సినిమాలో ఆయనది కీలక పాత్ర అయి ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. కేమియో పాత్రగా కాకుండా చరణ్ ఈ సినిమాలో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో, స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉండే పాత్రలో కనిపిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

అయితే నిజానికి ఆచార్యలో రామ్ చరణ్(Ram Charan) పాత్ర ప్రధానమైనది. అంతేకాకుండా పాత్ర నిడివి కూడా చాలా ఎక్కువేనట. కానీ సినిమా రన్‌టైమ్‌కు ఇది పెద్ద సమస్యగా మారడంతో, ఆచార్య చిత్రంలో చరణ్ పాత్ర నిడివిని మూవీ టీం తగ్గించేస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆచార్య(Acharya Movie)లో చరణ్ పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సీన్స్ తొలగించకుండా, సినిమాలో ఇతర పాత్రలను చిత్ర యూనిట్ తొలగిస్తే బాగుంటుందని మెగా అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ వార్తలపై ఇంకా ఆచార్య టీం స్పందించలేదు.

మరోవైపు ఆచార్య(Acharya ) సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తోన్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్‌(Kajal Agarwal)తో పాటు.. పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఆచార్య చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలతో కలిసి రామ్ చరణ్(Ram Charan) సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.  ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఈనెల 18న ఆచార్య నుంచి భలే భలే బంజారా అంటూ సాగే ఈ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ను తెలుగు టాప్ లిరిసిస్ట్స్ రామ జోగయ్య శాస్త్రి, భాస్కర్ బట్ల, అనంత్ శ్రీరామ్, కళ్యాణ్ చక్రవర్తి రాయడం విశేషం. మణిశర్మ సంగీతం వహిస్తున్న ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.  ఈ సినిమ ా ప్రిరిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

First published:

Tags: Acharya, Acharya movie, Megastar Chiranjeevi, Ram Charan

ఉత్తమ కథలు