హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: RRRతో లెక్క మారిందా ? ఆచార్య కోసం రామ్ చరణ్‌కు ఇన్ని కష్టాలా?

Acharya: RRRతో లెక్క మారిందా ? ఆచార్య కోసం రామ్ చరణ్‌కు ఇన్ని కష్టాలా?

రామ్ చరణ్‌, చిరంజీవి (Twitter/Photo)

రామ్ చరణ్‌, చిరంజీవి (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. తండ్రి మెగాస్టార్ అయిన సాధించలేని ఘనత కేవలం 14 సినిమాలు తీసి చెర్రీ సాధించుకున్నాడు. అయితే ఇప్పడు ఆచార్య విషయంలో అతని బాధ్యత మరింత పెరిగింది.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న మెగా మూవీ... ఆచార్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే చిరంజీవి చేస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి కొడుకులు నటించిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా విషయంలో ఇప్పుడు రామ్ చరణ్ బాధ్యత రెట్టింపు అయ్యింది. ఆర్ఆర్ఆర్ హిట్‌తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో తండ్రి సినిమాను ఇప్పుడు రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ చేస్తాడా ? చిరును ప్యాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాడా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక ఆచార్య విషయానికి వస్తే.. తెలుగులో క్రేజీ పిక్చర్. రామ్ చరణ్ నటించడంతో ఈ సినిమా అతనికి కూడా ఫుల్ లెన్త్ మూవీ. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానంతవరకు ఆచార్య తెలుగు సినిమాగానే ఉంది. అయితే ఆర్ఆర్ఆర్‌తో ఈ లెక్కలు పూర్తగా మారాయి. ఇప్పుడు చిరంజీవి ఆచార్య కూడా పాన్ ఇండియా మూవీగా మారిపోయింది. దీంతో రామ్ చరణ్ ఈ చిత్రంలో చిన్నపాత్ర చేసినప్పటికీ... దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మాత్రం చెర్రీదే.

మెగాస్టార్‌పై తెలుగు తెరపై ఎన్నో హిట్ సినిమాలు తీసిన చిరంజీవి సైతం గతంలో పాన్ ఇండియా స్టార్‌గా మారాలని ట్రై చేశాడు. హిందీలో ది అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ అయిన జెంటిల్ మ్యాన్,రాజశేఖర్ అంకుశం సినిమాను హిందీలో ప్రతిబంధుగా రిమేక్ చేసి ప్లాప్ అయ్యాడు. అయితే గ్యాంగ్ లీడర్ సినిమా హిందీలో గూండా రాజ్‌గా హిట్ అయినా సరే.... చిరు మాత్రం పాన్ ఇండియా స్థాయికి ఎదగలేకపోయాడు. ఆ తర్వాత మాత్రం బాలీవుడ్ వైపు చిరు చూడలేదు. రాజకీయాలతో బీజీగా మారిన తర్వాత చిరు పాలిటిక్స్‌కు బ్రేక్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా చేశాడు. అందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కీలక పాత్ర ఇచ్చి... సైరాను బాలీవుడ్‌ రేంజ్‌కు తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఆశించింది జరగలేదు.

ఇక తాజాగా చిరు మూవీ ఆచార్య విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఆ లెక్క పూర్తిగా మారిపోయింది. కేవలం అతి తక్కవ గ్యాప్ అంటే కేవలం రెండు నెలల వ్యవధిలో రామ్ చరణ్ తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ. చూడటానికి తండ్రీ కొడుకులు తీస్తున్నా.. ఇది కూడా ఓ రకంగా మల్టీ స్టారర్ మూవీనే. అనుకోకుండా చరణ్‌కు వచ్చిన ఛాన్స్. దీంతో ఈ అవకాశంతో తండ్రి చిరంజీవి సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు రామ్ చరణ్ భుజస్కందాలపైనే ఉంది. మరి చెర్రీ ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ 'ఆచార్య'. ఈ సినిమా ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. సోనూ సూద్, పోసాని, సంగీత, అనసూయ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రెజీనా ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనుంది. మణిశర్మ సంగీత దర్శకుడు.

'ఆచార్య' రిలీజ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం ఇటీవలే థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో చిరు - చరణ్ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. జస్ట్ ట్రైలర్‌కే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే 26 మిలియన్స్ ప్లస్ వ్యూస్ దక్కించుకుంది. మొత్తానికి రిలీజ్‌కు ముందే ఇలా రికార్డుల వేట మొదలవడంతో సినిమా కూడా భారీ సక్సెస్ సాధిస్తుందని అంతా అంచనాలు వేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, 29వ తేదీన  ఆచార్య సినిమాను విడుదల చేయనున్నారు.

First published:

Tags: Aacharya, Acharya movie, Chiranjeevi, Ram Charan