Home /News /movies /

IS RAM CHARAN IS REASON FOR REMOVING KAJAL ROLE IN ACHARYA MOVIE SB

Ram Charan: చరణ్ వల్లే కాజల్‌ను ఆచార్య నుంచి తప్పించారా ?

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

కాజల్ ఆచార్య సినిమాలో ఉందని ముందు నుంచి అంతా భావించారు. అయితే అకస్మాత్తుగా ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు కొరటాల ప్రకటించారు. దీనిపై కాజల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.



    ఆచార్య మూవీలో కాజల్ పాత్ర లేదంటూ ఆచార్య డైరెక్టర్ కొరటాల శివ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దీంతో కాజల్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. కాజల్ పాత్రకు ప్రాధాన్యత లేదని అందుకే ఆమెను సినిమా నుంచి తప్పించామని కొరటాల చెప్పిన విషయం తెలిసిందే మరి అలాంటి సమయంలో  అస్సలు ప్రాధాన్యత లేని పక్షంలో ఆమెను ఆచార్య సినిమాలోకి తీసుకోకుండా ఉంటే బాగుండేదని సినిమాలోకి తీసుకున్నామని ప్రకటించి లాహే లాహే పాటలో కాజల్ ను చూపించి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని కాజల్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.


    సినిమాకు సంబంధించి ప్రిరిలీజ్ ఈవెంట్ అయ్యాక.. కాజల్ విషయంలో ఎవరూ ఏం మాట్లాడకపోయేసరికి అందరికీ కాజల్ పాత్రపై అనుమానాలు వచ్చాయి.దీంతో ఈ విషయంలో పలువురు అభిమానులు నెటిజన్స్ ప్రశ్నించడంతో... కొరటాల కాజల్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. దీంతో కాజల్ పాత్రకు అస్సలు ప్రాధాన్యత లేని పక్షంలో ఆమెను సినిమాలోకి తీసుకోకుండా ఉంటే బాగుండేదని సినిమాలోకి తీసుకున్నామని ప్రకటించి లాహే లాహే పాటలో కాజల్ ను చూపించి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని కాజల్ ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాజల్ తప్పుకున్న సమయంలోనే ఈ విషయం చెప్పి ఉంటే బాగుండేదని సినిమా రిలీజ్ సమయంలో ఈ విషయం చెప్పడం ఏమిటని కాజల్ అభిమానులు మండిపడుతున్నారు.



    భరత్ అనే నేను.. శ్రీమంతుడు ఇలా ఏ సినిమాలో చూసినా.. హీరోయిన్ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొరటాల ఆయా సినిమాల్లో హీరోయిన్లను అద్భుతంగా చూపించారు. మరి  ప్రతి సినిమాలో హీరోయిన్ల పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్దిన కొరటాల శివ ఆచార్య విషయంలో మాత్రం ఒక హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దలేకపోయారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


    ఆచార్య సినిమాలో హీరోయిన్ల విషయంలో ముందు నుంచి కూడా ఓ రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. మొదట త్రిష ఎంపికయ్యారు. అయితే త్రిష ఈ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత నయనతార పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఎంపిక కాగా కాజల్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడం గమనార్హం. దీంతో హీరోయిన్ విషయంలో ఎందుకలా జరిగిందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

    అయితే కాజల్‌ను ఆచార్య నుంచి తప్పించడం వెనుక... రామ్ చరణ్ కారణం అని తెలుస్తోంది. ఆచార్యలో చరణ్ కొద్ది పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి అంతా అనుకున్నారు. అయితే  ఆచార్యలో చరణ్ పాత్ర నిడివిని పెంచాలని హీరోయిన్ పాత్రను తగ్గించారని అందుకే ఈ సినిమా నుంచి ఇద్దరు హీరోయిన్లు తప్పుకున్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పాత్రకు హీరోయిన్ లేకపోవడం సినిమాకు ఒక విధంగా మైనస్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆచార్య టీం కాజల్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్స్‌కు ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Acharya movie, Kajal Aggarwal, Ram Charan

    తదుపరి వార్తలు