ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్‌లతో లారెన్స్..స్టైల్ 2 సినిమా..ఫ్యాన్స్‌కు పండగే

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2006లో వచ్చిన స్టైల్ సినిమా గుర్తుండేవుంటుంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా.. అప్పట్లో అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా స్టైల్ 2 వస్తే...హీరోలుగా ఎవరైతే బాగుంటారో వెల్లడించాడు..దర్శకుడు లారెన్స్.

news18-telugu
Updated: April 20, 2019, 7:07 AM IST
ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్‌లతో లారెన్స్..స్టైల్ 2 సినిమా..ఫ్యాన్స్‌కు పండగే
తారక్, అల్లు అర్జున్, చరణ్‌
  • Share this:
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 2006లో వచ్చిన స్టైల్ సినిమా గుర్తుండే వుంటుంది. డాన్స్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా.. అప్పట్లో అదరగొట్టింది. ఆ సినిమాలో డాన్స్, సాంగ్స్..ఇప్పటికి చాలా మందికి గుర్తుంటాయి. అంతలా ఆకట్టుకుంది. సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన లారెన్స్.. ప్రభుదేవా .. ఛార్మిలు..తమ నటనతో ప్రేక్షకుల్నీ మెప్పించారు. అంతేకాకుండా.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలు సినిమాలో కీలక సమయంలో ప్రత్యేక్షమై తమ ప్రజెన్స్‌తో అలరిస్తారు. అంతలా ఆకట్టుకున్న.. ఆ సినిమాకు సీక్వెల్‌గా స్టైల్ 2ను తెరకెక్కిస్తారని..ఆ మద్య కొన్ని వార్తలొచ్చినా ఏదీ అధికారికంగా  ప్రకటించలేదు. అయితే తాజాగా `స్టైల్ 2` గురించి..ఆ సినిమాలో నటించే హీరోల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తారక్, అల్లు అర్జున్, చరణ్‌


వివరాల్లోకి వెళితే..నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ తన తాజా సినిమా `కాంచన 3`ని తెలుగులో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా..ఈ సినిమాకు సంబందించిన ప్రెస్ మీట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీట్‌లో లారెన్స్‌ ఓ ప్రశ్నకు సమాదానంగా మాట్లాడుతూ.. ఇక్కడ డ్యాన్స్ భాగా చేసే హీరోలలో అల్లు అర్జున్, చరణ్, ఎన్టీఆర్‌లు ఉన్నారు. చిరంజీవి అన్నయ్య.. గురించి ఈ సందర్భం లో చెప్పలేదని అనుకోవద్దు.. ఎందుకంటే ఆయనే అన్నింటికీ బాస్. అయితే.. స్టైల్ 2 చేసేటప్పుడు పెద్ద హీరోలు, అంతేకాకుండా మంచి డ్యాన్సర్స్ తోనే ప్లాన్ చేయాలి  అని చెబుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి స్టైల్ సినిమా నిర్మాత లడగపాటి శ్రీధర్‌ కూడా సిద్దంగానే ఉన్నాడని కూడా చెప్పాడు. దీంతో టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్స్ ముగ్గురిని కలిపి మెగాస్టార్ కీలక పాత్రలో ఈ డ్యాన్స్ బేస్డ్ సినిమా చేస్తే బాగానే ఉంటుందని ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరీ లారెన్స్.. అభిమానుల కలను నిజం చేసే ప్రయత్నం చేస్తాడా.. ఆ ముగ్గురిని కలిపి ఓ మెగా మల్టీస్టారర్ తీయనున్నాడా..చూడాలి మరీ ఈ మెగా కాంబీనేషన్ ఎంతవరకు నిజం అవుతుందో.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>