నయనతార లవ్ బ్రేకప్.. ప్రూఫ్ ఇదేనట..

నయనతార లవ్ బ్రేకప్.. ప్రూఫ్ ఇదేనట..

నయనతార (ఫైల్)

Nayanthara : దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతారకు షాక్ తగిలిందా? ముచ్చటగా మూడోసారి కూడా ఆమె లవ్ బ్రేకప్ అయ్యిందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  దక్షిణాది లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతారకు షాక్ తగిలిందా? ముచ్చటగా మూడోసారి కూడా ఆమె లవ్ బ్రేకప్ అయ్యిందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే.. న్యూఇయర్ వేడుకల్లో ఆమె ఒక్కరే సెలబ్రేట్ చేసుకోవడమే కారణంగా చూపిస్తారు కొందరు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉన్న నయన్.. శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించింది. అయితే, వారితో ఆమె లవ్ బ్రేకప్ కావడంతో కొన్ని రోజులు ఒంటరిగానే ఉంది. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడింది. ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించారు. తాము దిగిన ఫోటోలతో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచారు. చిన్న సందర్భం వచ్చినా సరే విదేశాల్లో విహరిస్తున్నారు.
  నయనతార

  అయితే, తాజాగా.. న్యూఇయర్ వేడుకలు మాత్రం ఇద్దరు వేర్వేరుగా జరుపుకున్నారు. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ప్రేమకు బ్రేకప్ పడిందని, అందుకే సెపరెట్‌గా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇది అంతా గాసిప్ మాత్రమేనని తెలుస్తోంది. ఎందుకంటే.. ఒంటరిగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నా.. నయన్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్ మాత్రం విఘ్నేశ్‌తో దిగిన ఫోటోనే ఉంది. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ కాలేదనే అనుకోవచ్చు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు