
సాయి పల్లవి (Sai Pallavi)
శేఖర్ కమ్ముల ఫిదా లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తన తాజా చిత్రాన్ని నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో 'లవ్ స్టోరి'పేరుతో తెరకెక్కిస్తోన్నాడు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని లాక్ డౌన్ తరువాత ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ పై చైతు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సాయి పల్లవి నటన గురించి మన అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అదే సమస్య అని వార్తలు వస్తున్నాయి. సాయి పల్లవి తన నటనతో చైతును చాలా సీన్స్‌లలో డామినేట్ చేసిందని అది తనకు నచ్చలేదని సమాచారం. ఆ సన్నివేశాలను మళ్లీ రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడనే ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ విషయంపై తాజాగా ఈ సినిమా యూనిట్ సభ్యులు స్పందిస్తూ, ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, సాయిపల్లవి చైతూ కూడా పోటీపడి చేశారని అన్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ముల.. సాయిపల్లవి నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు. ఈయన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పేరుతో ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Published by:Suresh Rachamalla
First published:May 04, 2020, 10:53 IST