• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • IS MUHURAT SET FOR CHIRANJEEVI AND PAWAN KALYAN MULTISTARRER MHN

Chiranjeevi - Pawan Kalyan: చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌కు ముహూర్తం కుదిరిందా?

Chiranjeevi - Pawan Kalyan: చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌కు ముహూర్తం కుదిరిందా?

Is muhurat set for Chiranjeevi and Pawan Kalyan multistarrer

Chiranjeevi - Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందనున్న మల్టీస్టారర్ సినిమాను దసరా పండుగకి లాంఛ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Share this:
    మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాంబినేష‌న్‌లో ఓ భారీ మల్టీస్టార‌ర్ రూపొందించ‌నున్న‌ట్లు ఇది వ‌రకే సీనియ‌ర్ నిర్మాత టి.సుబ్బ‌రామిరెడ్డి తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. మెగాభిమానులు, ప‌వ‌ర్‌స్టార్ అభిమానులు ఈ అనౌన్స్‌మెంట్‌తో ఎంత‌గానో సంతోషించారు. వీరిద్ద‌రి క‌లిసి న‌టించ‌లేదా? అంటే న‌టించారు. చిరంజీవి హీరోగా న‌టించిన శంక‌ర్‌దాదా జిందాబాద్ చిత్రంలో క్లైమాక్స్‌లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కాసేపు త‌ళుక్కున మెరిసి అన్న‌ద‌మ్ములు అభిమానుల‌ను అల‌రించారు. త‌ర్వాత చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం.. మ‌ళ్లీ సినిమాల్లోకి రావ‌డం... ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాన్ రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం.. రీసెంట్‌గా ఆయ‌న రీ ఎంట్రీ ఇవ్వ‌డం జ‌రిగాయి.

    ఈ క్ర‌మంలో వీరిద్ద‌రూ క‌లిసి ఇక‌పై అస‌లు న‌టించ‌రా? అనే ప్రశ్న కూడా అంద‌రికీ వ‌చ్చింది. అభిమానులైతే ఏదో గెస్ట్ రోల్స్ త‌ర‌హాలో కాకుండా చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూర్తిస్థాయి పాత్ర‌ల్లో న‌టించే మ‌ల్టీస్టార‌ర్ చూడాల‌ని ఉందంటూ చాలా సంద‌ర్భాల్లో తెలిపారు. ఈ క్ర‌మంలో ఈ మెగాబ్ర‌ద‌ర్స్‌తో టి.సుబ్బ‌రామిరెడ్డి సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌ని మాత్రం చెప్ప‌లేదు. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌స‌రా స‌మ‌యంలో ఈ సినిమాను లాంఛ్ చేయాల‌ని సుబ్బ‌రామిరెడ్డి చాలా ప‌ట్టుద‌ల‌గా ఉన్నార‌ట‌. ఈ విష‌యంపై క‌థ‌ను సిద్ధం చేయ‌మ‌ని త్రివిక్ర‌మ్‌ను కూడా కోరార‌ట‌.

    ఇందులో నిజానిజాలేంటో తెలియ‌డం లేదు. ఎందుకంటే త్రివిక్ర‌మ్, త‌దుప‌రి చిత్రాన్ని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ల్టీస్టార‌ర్‌పై ఎలా వ‌ర్క్ చేస్తాడ‌నేది ఆలోంచాల్సిన విష‌య‌మే. అలాగే మ‌రో వైపు చిరంజీవి కూడా ఆచార్య‌తో బిజీగా ఉన్నాడు. మ‌రో వైపు లూసిఫ‌ర్ తెలుగు రీమేక్‌, వేదాళం రీమేక్స్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉన్నాయి.
    Published by:Anil
    First published: