బాలీవుడ్ తెరంగేట్రంపై మానుషీ చిల్లర్ క్లారిటీ

ప్రస్తుతం సినీ పరిశ్రమకు సంబంధించి కొత్తకొత్త విషయాలను తెలుసుకోవడంపైనే తన దృష్టంతా ఉందని చెబుతున్న మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్.

Janardhan V | news18-telugu
Updated: June 19, 2018, 1:16 PM IST
బాలీవుడ్ తెరంగేట్రంపై మానుషీ చిల్లర్ క్లారిటీ
ఫైల్ ఫోటో: మిస్ వరల్డ్ 2017 మానుషీ చిల్లర్
  • Share this:
భారత్‌కు చెందిన మునుపటి విశ్వసుందరీలు అందరిలానే తాను కూడా బాలీవుడ్‌లో బిజీ కావాలని తహతహలాడుతోంది మిస్ వరల్డ్-2017 మానుషీ చిల్లర్. నటుడు అమీర్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, అతనితో నటించాలని ఉందని ఇప్పటికే తన ఆసక్తిని వ్యక్తంచేసింది. మానుషీ చిల్లర్ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుని ఇప్పటికి ఆరు మాసాలు గడిచిపోయింది. మంగళవారం రాత్రి జరిగే కార్యక్రమంలో మిస్ ఇండియా కిరీటాన్ని మరో భారత సుందరికి అందజేయనున్న చిల్లర్...మిస్ వరల్డ్ కిరీటాన్ని వచ్చే ఏడాది మరొకరికి అందజేస్తుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు కరీనా కపూర్, మాధురీ దీక్షిత్ తదితరులు పాల్గొననున్నారు. ఇక ఈ భారత సుందరి బాలీవుడ్ తెరంగేట్రం ఎప్పుడా ? అన్న చర్చ జరుగుతోంది. దీనిపై చిల్లర్ స్పందిస్తూ...తన బాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడన్నది కాలం చేతికే వదిలేస్తున్నట్లు చెప్పారు.

తాను ఇంకా కాలేజ్ పూర్తి చేయలేదని...ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నట్లు తెలిపింది. సినీ పరిశ్రమ గురించి తనకు ఏమీ తెలియదని, సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు కూడా తనకు లేదని చెప్పింది. ప్రస్తుతానికి తాను సినీ పరిశ్రమకు సంబంధించి కొత్తకొత్త విషయాలను తెలుసుకోవడంపైనే దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చింది చిల్లర్. జీవితంలో వచ్చే మార్పులను తాను ఆశ్వాదిస్తానని...బాలీవుడ్ ఆఫర్ వస్తే నిర్ణయం తీసుకుంటానని తెలిపింది.

21 ఏళ్ల మానుషి చిల్లర్ ప్రస్తుతం హర్యానా సోనిపట్ జిల్లాలోని ఆల్ గర్ల్స్ మెడికల్ కాలేజ్‌లో మెడిసిన్ చదువుకుంటోంది.

First published: June 19, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>