‘మన్మథుడు 2’కు కాపీ కష్టాలు.. ఫ్రెంచ్ రీమేక్‌పై కన్నేసిన నాగార్జున..

ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. ఎక్క‌డ చూడు కాపీ భాగోత‌మే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా ఎక్క‌డో ఓ చోట దాని మూలాలు క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 19, 2019, 6:27 PM IST
‘మన్మథుడు 2’కు కాపీ కష్టాలు.. ఫ్రెంచ్ రీమేక్‌పై కన్నేసిన నాగార్జున..
నాగార్జునతో రకుల్
  • Share this:
ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. ఎక్క‌డ చూడు కాపీ భాగోత‌మే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా ఎక్క‌డో ఓ చోట దాని మూలాలు క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు ప‌క్క దేశాల నుంచి ప‌ట్టుకొచ్చారు. అయితే చెప్పి తీసుకొస్తే రీమేక్ అంటారు.. చెప్పుకుండా తీస్తే ఫ్రీమేక్ అంటారు. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 విష‌యంలో రెండోది జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. అప్ప‌ట్లో అజ్ఞాత‌వాసి క‌థ చెప్ప‌కుండా త్రివిక్ర‌మ్ రీమేక్ చేసిన‌ట్లు.. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2ను కూడా ఫ్రెంచ్ సినిమా నుంచి రాహుల్ రాసుకున్నాడ‌ని తెలుస్తుంది.

Copyright issues on King Nagarjuna Akkineni Manmadhudu 2 and rumoured as Rahul Ravindran copy from a French movie pk.. ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. ఎక్క‌డ చూడు కాపీ భాగోత‌మే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా ఎక్క‌డో ఓ చోట దాని మూలాలు క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. manmadhudu 2,manmadhudu 2 copy,manmadhudu 2 french movie,manmadhudu 2 prete moi ta main french,nagarjuna samantha,nagarjuna rakul,manmadhudu 2 movie,manmadhudu 2,manmadhudu 2 teaser,nagarjuna manmadhudu 2 movie,manmadhudu 2 first look,nagarjuna manmadhudu 2,manmadhudu 2 movie songs,manmadhudu 2 trailer,manmadhudu 2 movie teaser,manmadhudu 2 movie trailer,manmadhudu 2 movie updates,manmadhudu 2 movie teaser update,manmadhudu 2 movie news,nagarjuna manmadhudu 2 teaser,nagarjuna new movie,manmadhudu,manmadhudu 2 movie launch,telugu cinema,మన్మథుడు 2,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు 2 టీజర్,మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమా,ప్రేతే మొయి తా మై సినిమా,నాగార్జున రకుల్,నాగార్జున సమంత,
మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమా

2006లో అక్క‌డ విడుద‌లైన ప్రేతే మెయి తా మై ఆధారంగా ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 క‌థ రాహుల్ రవీంద్ర‌న్ అల్లుకున్నాడని.. అక్క‌డున్న పాయింట్ త‌న సినిమాలో చూపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అక్క‌డ హీరోకు 45 ఏళ్లొచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోడు.. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లెప్పుడు అంటూ స‌తాయిస్తుంటారు.. అలాంటి స‌మ‌యంలో ఏం చేయాలో తెలియ‌క ఓ అమ్మాయిని భార్య‌గా అద్దెకు తీసుకొస్తాడు.. కానీ కాలం గ‌డిచిన కొద్ది నిజంగానే వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిపోతారు.

Copyright issues on King Nagarjuna Akkineni Manmadhudu 2 and rumoured as Rahul Ravindran copy from a French movie pk.. ఏ సినిమా చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం.. ఎక్క‌డ చూడు కాపీ భాగోత‌మే.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా ఎక్క‌డో ఓ చోట దాని మూలాలు క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. manmadhudu 2,manmadhudu 2 copy,manmadhudu 2 french movie,manmadhudu 2 prete moi ta main french,nagarjuna samantha,nagarjuna rakul,manmadhudu 2 movie,manmadhudu 2,manmadhudu 2 teaser,nagarjuna manmadhudu 2 movie,manmadhudu 2 first look,nagarjuna manmadhudu 2,manmadhudu 2 movie songs,manmadhudu 2 trailer,manmadhudu 2 movie teaser,manmadhudu 2 movie trailer,manmadhudu 2 movie updates,manmadhudu 2 movie teaser update,manmadhudu 2 movie news,nagarjuna manmadhudu 2 teaser,nagarjuna new movie,manmadhudu,manmadhudu 2 movie launch,telugu cinema,మన్మథుడు 2,నాగార్జున మన్మథుడు 2,మన్మథుడు 2 టీజర్,మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమా,ప్రేతే మొయి తా మై సినిమా,నాగార్జున రకుల్,నాగార్జున సమంత,
మన్మథుడు 2 ఫ్రెంచ్ సినిమా
తెలుగు ఇండ‌స్ట్రీలో ఇంచుమించు ఇలాంటి క‌థ‌తోనే చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌న్మ‌థుడు 2లో కూడా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను త‌న భార్య‌గా నాగార్జున అద్దెకు తెస్తాడ‌ని.. ఆ త‌ర్వాత క‌థ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే ఇదే గానీ నిజ‌మైతే ఇది త‌మ సినిమానే అని ఫ్రెంచ్ నిర్మాత‌లు కూడా కాపీ రైట్ వేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఆగ‌స్ట్ 9న మ‌న్మ‌థుడు 2 విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ చిత్రాన్ని సొంత క‌థ‌తో రాసుకున్నాడా.. లేదంటే ఫ్రెంచ్ నుంచి అరువు తెచ్చుకున్నాడా..?
First published: June 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading