పాలిటిక్స్‌లో కీర్తి సురేష్.. మహానటి ఎంట్రీ ఏ పార్టీలోనో తెలుసా..

మోడ్రన్ మహానటి కీర్తి సురేష్  పాలిటిక్స్‌లో  ఎంట్రీ ఇవ్వనుందా. తన రాజకీయ అరంగేట్రానికి ఆ పార్టీని వేదిక చేసుకోనుందా. అంటే ఔననే అంటున్నాయి సినీ,రాజకీయ వర్గాలు. వివరాల్లోకి వెళితే..

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: May 13, 2019, 6:55 PM IST
పాలిటిక్స్‌లో కీర్తి సురేష్.. మహానటి ఎంట్రీ ఏ పార్టీలోనో తెలుసా..
కీర్తి సురేష్
  • Share this:
మోడ్రన్ మహానటి కీర్తి సురేష్  పాలిటిక్స్‌లో  ఎంట్రీ ఇవ్వనుందా. తన రాజకీయ అరంగేట్రానికి బీజేపీని వేదిక చేసుకోనుందా. అంటే ఔననే అంటున్నాయి సినీ,రాజకీయ వర్గాలు. వివరాల్లోకి వెళితే..మ‌హాన‌టి త‌ర్వాత కీర్తి సురేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేకుండా పోయింది. ఈ చిత్రంతో కీర్తి సురేష్  ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. మ‌హాన‌టి త‌ర్వాత చాలా రోజుల తర్వాత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగులో ఓ సినిమా చేస్తోంది. వీటితో పాటు హిందీ,తమిళంలో పాటు మలయాళంలో ఫుల్లు బిజీగా ఉంది.ఇక కీర్తి సురేష్..త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. దీని వెనక పెద్ద రీజనే ఉంది. ఇప్పటికే కీర్తి సురేష్ వాళ్ల డాడీ సురేష్..బీజేపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్‌గా కీర్తి సురేష్ తల్లి..మేనక కూడా ప్రధానమంత్రి మోదీని కలిసిన సినీ నటుల్లో ఆమె కూడా ఒకరు. రీసెంట్‌గా కీర్తి సురేష్ తల్లి.. మలయాళ నటీనటులైన సురేష్ గోపి, కవితలతో కలిసి ప్రధాని మోదీని కలిసారు. అంతేకాదు సినీ నటుల తరుపున సంఘీభావం వ్యక్తం చేసారు. మొత్తానికి కీర్తి సురేష్ ఫ్యామిలీ బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయడంతో ఆటోమేటిక్‌గా కీర్తి సురేష్ పై బీజేపీ ముద్ర పడింది. ప్రస్తుతానికి సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. రానున్న రోజుల్లో బీజేపీలో అధికారికంగా చేరే అవకాశాలను కొట్టిపారేయలేము.

First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...