Nayanthara : నయనతార... విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాతో తెలుగువారికి పరిచయం అయ్యింది ఈ అందాల ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. అందులో భాగంగా.. నయన్.. తమిళ్‌లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. అది అలా ఉంటే.. నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్ దర్శకత్వంలో 2017లో వచ్చిన చిత్రం ‘ఆరమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ టైటిల్‌తో విడుదల చేశారు. ఈ సినిమాలో కలెక్టర్ పాత్రను పోషించిన నయనతారకు ప్రశంసలు లభించాయి. నయనతార కలెక్టర్ పాత్రలో అదరగొట్టింది. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడటం, ఓ ఊరి సమస్యల్ని తీర్చడం చుట్టూ ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో నయన్ నటించడం లేదని.. కాల్‌షీట్స్ లేకపోవడంతో ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌ను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అంతేకాదు ఈ సినిమాలో కీర్తి కూడా నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగాఈ సినిమా దర్శకుడు గోపీ నైనర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. ఆరమ్‌కు సీక్వెల్ తీస్తే.. అది నయనతారతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా వస్తున్న ఎలాంటీ వదంతుల్ని నమ్మొద్దని తెలిపాడు. నయనతార ఇటీవల తెలుగులో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ నటించింది. నయనతార ప్రస్తుతం ‘నెట్రికన్’, ‘కాతువాకుల రెండు కాదల్’ వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Keerthy Suresh, Nayanathara, Tamil Film News, Telugu Cinema News