హోమ్ /వార్తలు /సినిమా /

అనిరుధ్ అప్పుడే రెచ్చిపోతున్నాడా ? త్రివిక్రమ్‌నే టార్గెట్ చేశాడా ?

అనిరుధ్ అప్పుడే రెచ్చిపోతున్నాడా ? త్రివిక్రమ్‌నే టార్గెట్ చేశాడా ?

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనిరుధ్ రవిచంద్రన్(Image: Facebook)

త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అనిరుధ్ రవిచంద్రన్(Image: Facebook)

జెర్సీ సినిమా ద్వారా టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్ అందుకున్న కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పోస్ట్ చేసిన వీడియోపై ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    చిన్న వయసులోనే కోలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్‌కు ఎదిగిన అనిరుధ్ రవిచందర్... తెలుగులో మాత్రం అంత వేగంగా విజయాలను అందుకోలేకపోయాడు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుధ్... ఈ సినిమా దెబ్బకు తెలుగులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని అంతా అనుకున్నారు. కానీ అజ్ఞాతవాసి సినిమా అటు కమర్షియల్‌గా, ఇటు మ్యూజికల్‌గా సక్సెస్ కాకపోవడంతో అనిరుధ్ ఆశలు నెరవేరలేదు. ఈ సినిమా ఫెయిల్యూర్ సంగతి ఎలా ఉన్నా... ఈ సినిమా మ్యూజిక్ విషయంలో త్రివిక్రమ్ బాగా నిరాశ చెందారని గుసగుసలు వినిపించాయి.


    ఈ కారణంగానే అరవింద సమేత సినిమాకు మొదట అనిరుధ్‌కు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఆ తరువాత అతడిని పక్కపెట్టారనే ప్రచారం జరిగింది. అప్పటి నుంచి తెలుగులో మంచి హిట్ కొట్టి టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న అనిరుధ్ రవిచందర్... రీసెంట్‌గా ఆడియెన్స్ ముందుకు వచ్చిన జెర్సీ సినిమాతో హిట్ సాధించారు. సినిమా రిలీజైన తరువాత అనిరుధ్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఫుల్ ఖుషీ అవుతున్న అనిరుధ్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. నా పనైపోయిందనుకున్నారా అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగ్‌ను అనిరుధ్ పోస్ట్ చేయడం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌లో అనిరుధ్ పనైపోయిందని మాట్లాడుకునే వారి కోసమే అనిరుధ్ ఈ వీడియోతో కౌంటర్ ఇచ్చాడని కొందరంటుంటే... త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసుకునే కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ వీడియో పోస్ట్ చేశాడని గుసగుసలాడుకుంటున్నారు.

    First published:

    Tags: Anirudh Ravichander, Jersey, Trivikram

    ఉత్తమ కథలు