జబర్దస్త్ కామెడీ షోలో ఉన్నపుడు అవినాష్ గురించి ఎవరికీ ఏం తెలియదు. ఆయన కేవలం కామెడీ చేస్తాడని మాత్రమే తెలుసు. కానీ బిగ్ బాస్‌కు వచ్చిన తర్వాత పర్సనల్ లైఫ్ గురించి తెలుస్తుంది. దాంతో పాటు వ్యక్తిగతంగా అవినాష్ ఎలా ఉంటాడు.. ఎలాంటి వాడు అనేది కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా పర్సనల్ విషయాలను కూడా అక్కడ బాగానే చర్చిస్తున్నాడు అవినాష్. అయితే లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షో గురించి కూడా కొన్ని అనవసర వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్ అయిపోతున్నాడేమో అనిపిస్తుంది. పైగా బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత తనపై సింపతీ పెరిగిపోయేలా మాట్లాడుతున్నాడు. అక్కడ గేమ్ ప్లాన్ కూడా అలాగే కనిపిస్తుంది. మాట్లాడితే తన కుటుంబం కష్టాల్లో ఉంది.. తాను ఆత్మహత్య చేసుకునే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను.. దయచేసి తనను ఎలిమినేట్ చేయొద్దు.. నామినేట్ చేయొద్దు అంటూ వేడుకుంటున్నాడు. ఏకంగా కెమెరా ముందుకొచ్చి ఏడ్చేస్తున్నాడు. అయితే ఇదంతా చూసిన ఆడియన్స్ కచ్చితంగా నాటకాలే అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా పక్కనబెడితే మరీ ఎమోషనల్ డ్రామాలు ఎక్కువైపోతున్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

జబర్దస్త్ అవినాష్ (jabardasth ajay avinash)
కచ్చితంగా ఇలా ఏడ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం అసలుకే మోసం వస్తుందని అంతా అంటున్నారు. పైగా జబర్దస్త్ నుంచి తనను పంపించేసారని.. అక్కడ తనకు ఎంట్రీ కూడా లేదని చెప్పుకుంటున్నాడు అవినాష్. మరోవైపు ఆయన తమ్ముడు అజయ్ మాత్రం యూ ట్యూబ్ ఛానెల్స్‌కు ఇస్తున్న కొన్ని ఇంటర్వ్యూలలో అవినాష్‌ను జబర్దస్త్ నుంచి ఎవరూ తప్పించలేదని.. కావాలనే తను మళ్లీ రావచ్చంటూ కామెంట్ చేసాడు.

జబర్దస్త్ అవినాష్ అజయ్ (jabardasth ajay avinash)
అవినాష్ వెళ్లినా ఇప్పటికీ అజయ్ జబర్దస్త్‌లో చేస్తున్నాడు. కానీ అవినాష్ మాత్రం అక్కడ తనకు జబర్దస్త్ ఎంట్రీ లేదంటూ సింపతీ గేమ్ ఆడేస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి. స్వయంగా తమ్ముడు అజయ్ దీని గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎవర్ని మోసం చేయడానికి అవినాష్ ఇలాంటి గేమ్ ఆడుతున్నాడంటూ రివర్స్ అవుతున్నారు ప్రేక్షకులు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ గేమ్ ఎక్కడ ఆగుతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:November 13, 2020, 14:52 IST