Anchor Pradeep: యాంకర్ ప్రదీప్‌పై నిజంగానే కుట్ర జరుగుతుందా..?

యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Youtube/Photo)

Anchor Pradeep: బుల్లితెరపై యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు అన్ని ఛానెల్స్‌లో మంచి ఇమేజ్ ఉంది. అన్నిచోట్లా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేస్తున్నాడు.

  • Share this:
బుల్లితెరపై యాంకర్ ప్రదీప్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు అన్ని ఛానెల్స్‌లో మంచి ఇమేజ్ ఉంది. అన్నిచోట్లా ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ చేస్తున్నాడు. అలాగే బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కూడా. అమ్మాయిల్లో కూడా ప్రదీప్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు క్లీన్ ఇమేజ్ కూడా సంపాదించుకున్నాడు ఈయన. వివాద రహితుడిగా ప్రదీప్‌కు మంచి పేరు కూడా ఉంది. కానీ ఎందుకో తెలియదు కానీ కొందరు మాత్రం కావాలనే ప్రదీప్‌ను వివాదాల్లోకి లాగడానికి చూస్తున్నట్లు అనిపిస్తుంది.
యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)
యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు కూడా. ఈ మధ్యే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి తనపై 139 మంది అత్యాచారం చేసారని ఇచ్చిన ఫిర్యాదులో యాంకర్ ప్రదీప్ పేరు కూడా ఉండటం సంచలనం అయింది. అయితే దీనిపై ఆయన వెంటనే స్పందించాడు. నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది ఎలా రాస్తారు.. నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటూ సీరియస్ కూడా అయ్యాడు.
యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)
యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep)

అసలు ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఎవరూ ఆరా తీయడం లేదంటూ ప్రదీప్ ఆవేదన చెందాడు. తనపై కావాలనే కుట్ర చేస్తున్నారంటూ ఆయన బాధ పడుతున్నాడు. గతంలో కూడా తనపై ఇలాంటివి జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో సునిశిత్ కూడా ఫేమ్ కోసం ప్రదీప్ పేరు వాడుకున్నాడు. ఓ అమ్మాయిని మోసం చేసాడంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసాడు. ఆ తర్వాత అతడు ఫ్రాడ్ అని తేలింది. ఇప్పుడు కూడా కేసు ఇలాగే ఉంటుందని ఆయన నమ్ముతున్నాడు.
యాంకర్ ప్రదీప్ (anchor Pradeep Machiraju)
యాంకర్ ప్రదీప్ (Source: Twitter)

అయితే ఉన్నదీ లేనిదీ చూడకుండా అనవసరంగా తన పేరు వాడుకుంటున్నారు అంటూ ప్రదీప్ బాధ పడుతున్నాడు. మరి ఈ కేసులో పోలీసులు ఎలాంటి విచారణ చేపడతారో.. అందులో ప్రదీప్‌కు క్లీన్ చిట్ వస్తుందా రాదా అనేది త్వరలోనే తేలనుంది. ప్రస్తుతానికి అయితే సోషల్ మీడియాలో కూడా ప్రదీప్‌కు అంతా అండగా నిలుస్తున్నారు. దానికితోడు ఆయన సహనటులు, ఇండస్ట్రీ కూడా ప్రదీప్ అలాంటి వాడు కాదంటూ నిక్కచ్చిగా చెప్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: