తెలుగు ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పడినా లేచి మళ్లీ పరిగెడుతున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ దర్శకుడి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. ఈయన కొడుకు ఆకాశ్‌తో నటి హేమ కూతురు ఇషా పెళ్లి జరగబోతుందని దీని సారాంశం. ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ క్లారిటీ ఇవ్వడం లేదు అంతే. తాజాగా మరోసారి పూరీ, హేమ బంధుత్వం గురించి వార్తలు పుట్టుకొచ్చాయి. హేమ కూతురు ఇషాను ఆకాశ్ పూరీకి అడుగుతున్నారని.. ఈ విషయం గురించి త్వరలోనే పూర్తి క్లారిటీ రానుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయంపై ఇప్పటికే హేమ మాట్లాడింది. తన కూతురుతో పూరీ కొడుకుకు పెళ్లి అనేది చాలా రోజుల నుంచి తాను కూడా వింటున్న వార్త అంటుంది. ఇందులో కొన్ని ఆసక్తికరమైన నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కెరీర్ కొత్తలో పూరీ జగన్నాథ్‌కు అండగా నిలబడింది హేమ.
ఆయనకు పెళ్లి చేసింది కూడా ఈమే. అప్పట్లో పూరీ జగన్నాథ్ పెళ్లికి సాయం చేసింది. అంతేకాదు పూరీని అన్నయ్య అని పిలుస్తుంది హేమ. దాంతో ఆయన కొడుకు అంటే హేమ కూతురుకు వరస అవుతాడు. వాళ్లిద్దరికి మంచి చనువు కూడా ఉందని చెప్పింది హేమ. అయితే పెళ్లి అనే ఉద్ధేశ్యం మాత్రం లేదని చెప్పింది హేమ. ఒకవేళ తన కూతురు ప్రేమిస్తే మాత్రం కాదననంటుంది. ఎవర్ని ప్రేమించినా కూడా గౌరవంగా అతడికే ఇచ్చి పెళ్లి చేస్తానని.. పిల్లల ఇష్టాలను కాదనలేం కదా అంటుంది హేమ. అప్పట్లో పూరీ జగన్నాథ్ కెరీర్ కొత్తలో పెళ్లికి సాయం చేసింది హేమ. ఆమెతో పాటు అప్పుడు యాంకర్ ఝాన్సీ కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Hema, Puri Jagannadh, Telugu Cinema, Tollywood