క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్..
క్రికెట్, సినిమాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఇక్కడి వాళ్లు అక్కడ.. అక్కడి వాళ్లు ఇక్కడ రొమాన్స్ చేస్తూనే ఉంటారు. సాక్షాత్తూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడున్న ఇండియన్ టీంలో చాలా మంది కుర్ర క్రికెటర్లు రొమాంటిక్ బాయ్సే. ముఖ్యంగా అందులో కేఎల్ రాహుల్ అయితే మరీ నాటీ. మనోడు ఎప్పుడూ ఎఫైర్లతో బిజీగా ఉంటాడు. మొన్నటి వరకు ఇస్మార్ట్ పోరీ నిధి అగర్వాల్‌తో ఎఫైర్ సాగించిన రాహుల్.. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
రాహుల్ అతియా శెట్టి ఫైల్ ఫోటోస్
ఒకప్పటి స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు ఆతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం బాగా గట్టిగా జరుగుతుంది. దానికి తగ్గట్లే రాహుల్‌తో అతియా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వస్తున్నాయి. ఆమెకు ఆ మధ్య ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపాడు రాహుల్. ఇక అథియా కూడా రాహుల్ విషెస్ తీసుకుంటూనే కోతి ఇమోజీని షేర్ చేసింది. ఇప్పుడేమో ఈమె షేర్ చేసిన ఓ ఫోటోలో కేఎల్ రాహుల్ ఫోటోను కావాలనే క్రాప్ చేసారు. దీని ఒరిజినల్ ఫోటో చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.
ఆ మధ్య బర్త్ డే విషెస్ చెప్పినపుడు కోతి ఇమోజీతో పాటు ప్రేమ ఇమోజీలను కూడా షేర్ చేసి లేనిపోని డౌట్స్ క్రియేట్ చేసింది. అతియా శెట్టి శెట్టి నిజంగానే కేఎల్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి. హీరో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ.. హిట్ కోసం వేచి చూస్తుంది. ఇదే సమయంలో రాహుల్ ప్రేమతో మరోసారి వార్తల్లో నిలిచింది అతియా. మరి వీళ్ల ప్రేమాయణం ఎక్కడి వరకు వెళ్లనుందో..?
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.