Home /News /movies /

IS ANCHOR RAVI GIVE RE ENTRY INTO BIGG BOSS 5 HOUSE WILL IT BE POSSIBLE AK

Bigg Boss 5: యాంకర్ రవి మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడా ?

యాంకర్ రవి (ఫైల్ ఫోటో)

యాంకర్ రవి (ఫైల్ ఫోటో)

Bigg Boss 5 Anchor Ravi: హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే రవి అత్యంత అర్హత కలిగిన కంటెస్టెంట్ అని నిర్వాహకులకు వివిధ మాధ్యమాల ద్వారా సందేశాలు పంపుతున్నారు.

    తెలుగు యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి వివిధ కారణాల వల్ల మరోసారి వార్తల్లో నిలుస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి రవి ఎలిమినేషన్‌ అన్యాయమంటూ కొందరు అన్నపూర్ణ స్టూడియోస్ ముందు నిరసనలు చేపట్టారు. మళ్లీ రవిని బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకోవాలని డి ప్రేక్షకులు అతన్ని మళ్లీ షోలోకి తీసుకోవాలని స్టార్ మాను డిమాండ్ చేస్తున్నారు. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే రవి అత్యంత అర్హత కలిగిన కంటెస్టెంట్ అని నిర్వాహకులకు వివిధ మాధ్యమాల ద్వారా సందేశాలు పంపుతున్నారు. ఈ రకంగా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో యాంకర్ రవిని మళ్లీ షోకి తీసుకురావాలని స్టార్ మా యోచిస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. దఈ వారాంతంలో రవి ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై షో మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. రవి కూడా దీనిపై మాట్లాడటం లేదు.

    మరోవైపు రవిని హౌస్ నుంచి బయటకు పంపడానికి కారణం ఏంటనే దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లహరి-ప్రియ ఎపిసోడ్‌లో అమ్మ మీద ఒట్టు అంటూ అబద్దాలు చెప్పడం రవికి అతిపెద్ద మైనస్‌ అని చెప్పొచ్చు. అప్పటివరకు గుంటనక్క, ఇన్ఫులెన్స్ స్టార్ అని ట్యాగ్‌ లైన్స్‌ వచ్చినా.. ఈ ఒక్క ఎపిసోడ్‌తో రవి గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది.

    ఇక శ్వేత ఎలిమినేషన్‌కి కూడా పరోక్షంగా రవి కారణం అవ్వడంతో మరింత నెగిటివ్‌ అయ్యాడు. అయినప్పటికీ అతనికి ఉన్న ఫ్యాన్‌ బేస్‌తో నామినేట్‌ అయిన ప్రతీసారి సేవ్‌ అవుతూ వచ్చాడు. ఈసారి కూడా నామినేషన్స్‌ నుంచి ఈజీగా గట్టెక్కేస్తాడని అంతా భావించారు. టాప్‌-5కి రవి చాలా సులువుగా చేరుకుంటాడని అనుకున్నారంతా. దీంతో రవికి ఎలాగైనా భారీ ఓట్లు పడతాయని భావించి ఫ్యాన్‌ బేస్‌ తక్కువ ఉన్నవారిని సేవ్‌ చేయడం కోసం వారికి ఓట్లు వేశారు.

    Anchor Ravi Remuneration: యాంకర్ రవికి విన్నర్‌కు మించిన రెమ్యునరేషన్.. భరించలేక బయటికి పంపేసారా..?

    Bigg Boss Telugu shocking eliminations: యాంకర్ రవి సహా.. బిగ్ బాస్ తెలుగు 5 సీజన్స్‌లో మోస్ట్ షాకింగ్ ఎలిమినేషన్స్ ఇవే..

    ఇది రవికి చాలా పెద్ద మైనస్‌గా మారింది. ఎలాగో ఓట్లు పడతాయి అన్న ఉద్దేశంతో మిగతా వారికి ఓట్లు వేయడం కూడా రవి ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం అయి ఉండొచ్చని టాక్‌ వినిపిస్తుంది. ఏది ఏమైనా టాప్‌-5లో ఉండాల్సిన కంటెస్టెంట్‌ ఇలా అనూహ్యంగా బయటకు రావడం రవి బ్యాడ్‌ లక్‌ అని చెప్పాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Anchor ravi, Bigg Boss 5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు