యాంకర్ ప్రదీప్ నిజంగా లవ్ చేశాడా.. అసలు ఎందుకు ఏడ్చాడు..?

ప్రజెంట్ ఎన్నో షోలతో బిజీగా గడుపుతున్న ప్రదీప్.. తాజాగా ఢీ జోడీ షోలో కంటతడి పెట్టాడు. లవ్‌కి సంబంధించిన సాంగ్ పాడుతూ ఫుల్ ఎమోషన్ అయ్యాడు. ఆ టైమ్‌లోనే సుడిగాలి సుధీర్ ఆ సీన్‌ని మరింత రక్తికట్టించాడు.. తాను ప్రదీప్‌ని ఎప్పట్నుంచో చూస్తున్నాని.. ఎప్పుడూ కూడా తన కంట్లో కన్నీరు చూడలేదని చెప్పాడు. అంతటితో ఆగక ఆర్ యూ లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రశ్నించాడు.

news18-telugu
Updated: May 17, 2019, 5:38 PM IST
యాంకర్ ప్రదీప్ నిజంగా లవ్ చేశాడా.. అసలు ఎందుకు ఏడ్చాడు..?
కంటతడి పెట్టిన ప్రదీప్
news18-telugu
Updated: May 17, 2019, 5:38 PM IST
స్మాల్ స్క్రీన్‌పై యాంకరింగ్ చేసేస్తూ సెలబ్రిటీ లెవల్‌కి వెళ్లిన యాంకర్స్‌లో ప్రదీప్ ఒకరు. గడసరి అత్త-సొగసరి కోడలు అంటూ చిలిపిగా ఓప్రోగ్రామ్ చేసేసి గడపగడపకి చేరువైన ఈ కుర్రాడు బుల్లితెరపై అడుగుపెట్టిన కొన్ని రోజుల్లోనే హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించాడు. ఇతడి స్టైల్, మాటల్లోని మ్యాజిక్, చిలిపి యాంకరింగ్‌ని చూసి చాలామంది అమ్మాయిలే మనసుపారేసుకున్నారు. ఇదే క్యాష్ చేసుకునేందుకు టీవీ ఛానల్ స్వయంవరం అని కూడా షో చేసేసింది. ఓ మాములు అబ్బాయిలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోడు కొన్నిసినిమాల్లోనూ నటించాడు... అంతేనా.. తనే లీడ్ షో చేసేస్తూ కొంచెం టచ్‌లో ఉంటానంటూ సెలబ్రిటీల విషయాలను అడుగుతూ ఫ్యాన్స్‌ హార్ట్స్‌ని బాగానే టచ్ చేసేశాడు.

ప్రజెంట్ ఎన్నో షోలతో బిజీగా గడుపుతున్న ప్రదీప్.. తాజాగా ఢీ జోడీ షోలో కంటతడి పెట్టాడు. లవ్‌కి సంబంధించిన సాంగ్ పాడుతూ ఫుల్ ఎమోషన్ అయ్యాడు. ఆ టైమ్‌లోనే సుడిగాలి సుధీర్ ఆ సీన్‌ని మరింత రక్తికట్టించాడు.. తాను ప్రదీప్‌ని ఎప్పట్నుంచో చూస్తున్నాని.. ఎప్పుడూ కూడా తన కంట్లో కన్నీరు చూడలేదని చెప్పాడు. అంతటితో ఆగక ఆర్ యూ లవ్ ఫెయిల్యూర్ అంటూ ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా.. కొన్నిజరుగుతుంటాయి. వాటిని దాటి రావాలి. అలా వచ్చాను కాబట్టి యాంకర్ అయ్యానన్నాడు.. తిరిగి సుధీర్ ఎప్పుడు లవ్ చేశావని అడగ్గా కెరీర్ స్టార్టింగ్‌లో అని సమాధానం ఇచ్చాడు. ఈ సీన్ మొత్తం ఆ ఎపిసోడ్‌కే హైలైట్ అయి ప్రజెంట్ ఆ వీడియో యూట్యూబ్‌లో దుమ్మురేపుతూ ట్రెండింగ్ వన్‌లో దూసుకెళ్తుంది.

దాదాపు పదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్న ప్రదీప్.. ఎప్పుడూ కూడా తన గురించి ఎమోషనల్‌గా చెప్పలేదు. చివరికీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్ అప్పుడు కూడా అంతగా బాధపడలేదు.. కానీ, రీసెంట్‌గా తాను ఎమోషనల్‌గా మాట్లాడడంతో ఆ వీడియోని లక్షలాది మంది చూస్తున్నారు. షేర్ చేస్తున్నారు. అయితే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చేశారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏది తను లవ్ ఫెయిల్యూర్ అంటూ మనోడే ఒప్పుకోవడంతో ఈ న్యూస్ మరింత వేగంగా విస్తరించింది.

ఇవి కూడా చదవండి..



గూగుల్‌లో నావి అలాంటి ఫొటోలే ఉన్నాయి.. అదితీ రావు హైదరి షాకింగ్ కామెంట్స్..
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...