హోమ్ /వార్తలు /సినిమా /

‘Mr. మజ్ను’ రణ్‌బీర్ కపూర్ ఫ్లాప్ సినిమాకు రీమేకా..?

‘Mr. మజ్ను’ రణ్‌బీర్ కపూర్ ఫ్లాప్ సినిమాకు రీమేకా..?

నాగార్జున, అఖిల్ (Nagarjuna Akhil)

నాగార్జున, అఖిల్ (Nagarjuna Akhil)

తొలి రెండు సినిమాలతో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయిన అక్కినేని నట వారసుడు అఖిల్...ఇపుడు ముచ్చటగా మూడో సినిమా ‘Mr.మజ్ను’ను  వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్. పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈ మూవీ కోసం నాగార్జున పాత ఫార్ములానే ప్లే చేసినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా చదవండి ...

  తొలి రెండు సినిమాలతో అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయిన అక్కినేని నట వారసుడు అఖిల్...ఇపుడు ముచ్చటగా మూడో సినిమా ‘Mr.మజ్ను’ను  వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్. పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈ మూవీ బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా ఓ మోస్తరుగా నడిచిన ‘బచ్నా ఏ హసీనో’ మూవీకి రీమేక్ అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.


  ‘తొలిప్రేమ’ మూవీ తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే వెంకీ అట్లూరి ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టాడు. ఇంత వేగంగా ఈ మూవీ కథను రెడీ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అంతా ఈజీ కాదు. ఒకవేళ ముందుగా రాసుకున్న కథతో ఈ సినిమాను చేసినా..అఖిల్ ఇమేజ్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి నాగార్జునతో ఈ స్క్రిప్ట్ ఓకే చేయించుకోవడం కూడా అంతా తేలికైన విషయం కాదు.


  బాలీవుడ్‌లో ఓ మాదిరిగా నడిచిన ఈ మూవీలో హీరో రణ్‌బీర్ పూటకో అమ్మాయితో తిరిగే ప్లే బాయ్ పాత్రలో నటించాడు. అలాంటి అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించడంతో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయన్నదే ఈ మూవీ స్టోరీ. మరి బీటౌన్ ఆడియన్స్‌ను అంతగా మెప్పించని ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


  ఇవి కూడా చదవండి 


  సల్మాన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ‘భారత్’ టీమ్


  ‘బాహుబలి’కి పోటీగా వస్తున్న ‘కేజియఫ్’.. ప్రభాస్‌ను యశ్ తట్టుకుంటాడా..?


  టైటిల్‌లో పేరు పెట్టుకోవడానికి భయపడుతున్న టాలీవుడ్ స్టార్స్

  First published:

  Tags: Akhil, Nagarjuna, Telugu Cinema, Tollywood