ఐశ్వర్యా రాయ్ మరోసారి తల్లి కాబోతుందా..

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి గర్భం దాల్చారా ? ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా  ? ఇపుడీ డౌట్స్ ఏమిటంటారా.. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: March 25, 2019, 7:16 PM IST
ఐశ్వర్యా రాయ్ మరోసారి తల్లి కాబోతుందా..
ఐశ్వర్యరాయ్ బచ్చన్‌
  • Share this:
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి గర్భం దాల్చారా ? ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా  ? ఇపుడీ డౌట్స్ ఏమిటంటారా.. రీసెంట్‌గా ఐశ్వర్యారాయ్ ..ఆమె భర్త అభిషేక్ బచ్చన్‌తో ఉన్న ఒక ఫోటో నెట్‌లో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. అభిషేక్, ఐశ్వర్యా రాయ్‌ గోవాలో ఒక బీచ్‌లో ఉండగా తీసారు. ఈ ఫోటోలు బయటకు వచ్చాకా ఐశ్వర్యారాయ్ తిరిగి గర్భవతి అయిందంటూ వార్తలు వినిపించాయి. తాజాగా ఐశ్వర్యారాయ్ ..రెండో గర్భం విషయమై ఆమె మేనేజర్ స్పందించారు. ఐశ్వర్యా తన భర్తతో ఫోటో దిగేటప్పుడు కెమెరా యాంగిల్ సరిగా లేదు. అందుకే ఆ ఫోటో అలా వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఐశ్వర్యారాయ్ గర్భవతి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కాగా ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం 2007లో జరిగింది. వీరికి 2011లో ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం ఈ రియల్ లైఫ్ భార్య భర్తలు ‘గులాబ్ జామూన్’ అనే సినిమలో మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది.

First published: March 25, 2019, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading