హోమ్ /వార్తలు /సినిమా /

Iruvar Movie: "ఇద్ద‌రు" సినిమా విడుద‌ల అయ్యాక‌.. త‌న పాత్ర‌ గురించి జ‌య‌ల‌లిత ఏం అన్నారు!

Iruvar Movie: "ఇద్ద‌రు" సినిమా విడుద‌ల అయ్యాక‌.. త‌న పాత్ర‌ గురించి జ‌య‌ల‌లిత ఏం అన్నారు!

ఇద్ద‌రు సినిమాలో ఐశ్వ‌ర్యాయ్‌-మోహ‌న్‌లాల్‌

ఇద్ద‌రు సినిమాలో ఐశ్వ‌ర్యాయ్‌-మోహ‌న్‌లాల్‌

Iruvar Movie | 1997లో ఇరువర్ (తెలుగులో ఇద్దరు) చిత్రం వ‌చ్చింది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ సిన‌మా అప్ప‌ట్లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొంది. ఈ సినిమా విడుద‌ల అయ్యాక రెండేళ్ల‌కు దివంగ‌త త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త‌న పాత్ర‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇంకా చదవండి ...

  ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) 1997లో ఇరువర్ (తెలుగులో ఇద్దరు) చిత్రంలో న‌టించింది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. సంతోష్ శివన్ సినిమాటోగ్ర‌ఫీ నిర్వ‌హించారు. ఏఆర్‌ రెహమాన్ అద్బుత‌మై సంగీతం అందించారు. ఈ సిన‌మా అప్ప‌ట్లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకొంది. 2012లో బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన 1000 గొప్ప చిత్రాలలో జాబితా చేర్చారు. తమిళనాడుకు ముగ్గురు ముఖ్యమంత్రులుగా ప‌ని చేసిన ఎంజి రామచంద్రన్, కె కరుణానిధి, జె జయలలిత (J. Jayalalitha)  జీవితాల నుంచి ఈ చిత్రం రూపొందించారు. త‌మిళ రాజ‌కీయాల‌పై ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఇంగ్లీషులో ‘ది డ్యూయో’గా అనువదించారు కూడా. ప్ర‌ధాన పాత్ర‌లు మోహన్‌లాల్ త‌మిళంలో ఇది మొద‌టి సినిమా.. ప్రకాష్ రాజ్ (Prakash Raj), గౌతమి, రేవతి మరియు టబు అన్ని ఎంతో ముఖ్య‌మైన పాత్ర‌లు.

  ఐశ్వ‌ర్య స‌రిపోతుంది..

  ఈ సినిమా విడుద‌లై జనవరి 14కి 25 ఏళ్లు పూర్తి చేసుకొంటుంది. ఈ చిత్రం ఐశ్వర్య కెరీర్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డింది. అన్ని భాష‌ల్లో అమెకు ఈ సినిమా చేరువ చేసింది. ఇద్ద‌రు చిత్రంలో ఐశ్వర్య పాత్ర నిజ జీవితంలో జయలలిత జీవితం నుంచి ప్రేరేరణ పొంది రూపొందించారు. దివంగ‌త నాయ‌కురాలు గతంలో ఒక‌ టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప‌లు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. ఇద్ద‌రు సినిమా విడుద‌లై రెండేళ్ల త‌ర్వాత ఈ ఇంట‌ర్వ్యూ (Interview)  జ‌రిగింది. ఆ ఇంట‌ర్వ్యూలో ఐశ్వ‌ర్యరాయ్ త‌న చిన్న‌తనంలో ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌డానికి చాలా బాగా స‌రిపోంతుంద‌ని ఆమె అన్నారు.

  Biopics in Bollywood: బాలీవుడ్‌లో బ‌యోపిక్ ఫీవ‌ర్‌.. ఇప్ప‌ట్లో త‌గ్గేలా లేదు!


  ఇటీవ‌ల నటి కంగనా రనౌత్ తలైవిలో జయలలిత పాత్రను పోషించింది. క‌రోనా కార‌ణంగా స‌రైన విడుద‌ల తేదీ లేక‌పోవ‌డంతో బాక్స్ ఆఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పాలైంది. ఇరువర్ కూడా బాక్సాఫీస్ (Box office) వద్ద పరాజయం పాల‌వ్వ‌డం విశేషం. ఈ సినిమా గురించి ఐశ్వ‌ర్య‌రాయ్ ప‌లు ఇంట‌ర్వ్యూలో చాలా సార్లు స్పందించారు. మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌పై ఆమె ప‌లు సార్లు ప్ర‌శంస‌లు కురిపించారు.

  Rashmika Mandanna: త‌గ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ.. హిట్‌తో రేటు పెంచేసిన ర‌ష్మిక!


  క‌థ ఏమిటీ..

  1950ల నాటి కాలంలో సినిమా ప్రారంభమౌతుంది. ఇబ్బందులుపడుతున్న నటుడు ఆనంద్ (మోహన్ లాల్) క‌ష్ట‌ప‌డి హీరోగా ఎదుగుతాడు. అత‌ని విజ‌యంలో రచయిత సమరసూర్యాన్ని(ప్రకాష్ రాజ్) తోడుగా ఉంటాడు. అనంత‌రం స‌మ‌ర సూర్య రాజ‌కీయాల్లో క్రీయాశీల‌కంగా మారుతారు. ముఖ్య‌మంత్రి అవుతారు. సినిమా హీరోగా ఎదుగుద‌ల క్ర‌మంలో ఆనంద్ జీవితంలోకి న‌టి కల్పన (ఐశ్వర్య రాయ్) వస్తుంది. ఈమె ఆనంద్ మొద‌టి భార్య‌ను పోలి ఉంటుంది. క‌ల్ప‌న క్యారెక్ట‌ర్ నిజ జీవితంలో జ‌య‌ల‌లిత పాత్ర నుంచి స్పూర్తి పొందార‌ని చాలా మంది చెబుతుంటారు. కొంత కాలానికి రాజ‌కీయంగా ఆనంద్, సమరసూర్య విడిపోవ‌డం. ప్ర‌త్యేక పార్టీలు పెట్ట‌డం రాజ‌కీయంగా మ‌లుపుల‌తో ఈ సినిమా సాగుతుంది. ఎక్కువ‌గా త‌మిళ రాజ‌య‌కీయాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Aishwarya Rai, Aishwarya Rai Bachchan, Jayalalitha, Manirathnam, Mohan Lal, Prakash Raj

  ఉత్తమ కథలు