K Raghavendra Rao: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవా ? లేక మోహన్ బాబా ?.. దర్శకేంద్రుడి రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు..

మోహన్ బాబు, చిరంజీవి (పైల్ ఫోటో)

Tollywood News: రాఘవేంద్రరావు వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మా ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కాస్త మెగా, మంచు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్‌గా మారిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

  • Share this:
    మా ఎన్నికల గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. దాసరి నారాయణరావు చనిపోయిన తరువాత ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి మారిపోయారని.. చాలా సమస్యల పరిష్కారం కోసం ఆయనే చొరవ తీసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే మా ఎన్నికల్లో చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించిన ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఓడిపోవడం.. మోహన్ బాబు (Mohan Babu) తనయుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పరిణామాలు మారిపోయాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎవరనే విషయంలో చిరంజీవికి మోహన్ బాబు పోటీ అయ్యారనే ప్రచారం మొదలైంది. ఇకపై సినీ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కరించే విషయంలో చిరంజీవి, మోహన్ బాబుల్లో ఎవరు చొరవ తీసుకుంటారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

    అయితే ఈ అంశంపై టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ పెద్ద ఎవరనే దానిపై స్పందించిన రాఘవేంద్రరావు… అసలు ఇండస్ట్రీ పెద్ద అనే లాజిక్‌ను తాను నమ్మబోనని అన్నారు. అసలు ఇండస్ట్రీ పెద్ద అంటూ ఎవరూ ఉండరని తెలిపారు. ఇంట్లో ఉన్న మన పిల్లలే మన మాట వినడం లేదని రాఘవేంద్రరావు గుర్తు చేశారు. మన ఇంట్లోనే జరగనిది బయట ఎలా జరుగుతుందని అన్నారు. అలాంటిది ఇండస్ట్రీ విషయంలో మన చెప్పడం ఎందుకు ? వాళ్లు వినడం లేదని బాధపడటం ఎందుకు ? అని కామెంట్ చేశారు. ఎవరైనా ఇండస్ట్రీలో వారికి ఉన్న గౌరవం కాపాడుకుంటే చాలు అన్నది తన ఉద్దేశ్యమని రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు.

    Krishna Tulasi serial, Raghavendra Rao Krishna Tulasi, Raghavendra Rao serials. Krishna Tulasi serial start soon, కృష్ణ తులసి, రాఘవేంద్రరావు కృష్ణ తులసి
    కే.రాఘవేంద్రరావు (File/Photo)


    రాఘవేంద్రరావు వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. మా ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది కాస్త మెగా, మంచు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్‌గా మారిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా.. అవి పరోక్షంగా అవతలి వారిపైనే చేసినట్టుగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    దీంతో చాలాకాలం క్రితం మొదలై తగ్గిపోయిందనుకున్న మెగాస్టార్, మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్.. ఇప్పుడు మళ్లీ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. మా ఎన్నికల గొడవలు పూర్తిగా ముగిసిపోతేనే.. ఈ మొత్తం అంశంపై రచ్చకు కూడా ఫుల్ స్టాప్ పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: