• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • IPL ANCHOR VINDHYA VISHAKA TAKES INITIATIVE TO AUCTION HER OUTFITS FOR FUND RAISING AGAINST SONUSOOD FOUNDATION SRD

Sonu Sood : సోనూసూద్ ఫాండేషన్ కు విరాళం ఇవ్వడానికి యాంకర్ వింధ్యా వినూత్న ఆలోచన

Sonu Sood : సోనూసూద్ ఫాండేషన్ కు విరాళం ఇవ్వడానికి యాంకర్ వింధ్యా వినూత్న ఆలోచన

యాంకర్ వింధ్యా విశాఖ

Sonu Sood : రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. సోనూసూద్‌ కోవిడ్‌ బాధితుల కోసం సొంతంగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Share this:
    దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయ్. చాలా మంది ప్రజలు సమయానికి వైద్యం అందక చనిపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్‌, బెడ్స్‌ కొరత వల్ల వైద్య సదుపాయాలు అందక ఎంతోమంది తమ సొంతవారి కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నారు. ఇక, సోనూసూద్.. (Sonu Sood ) కరోనా కష్టకాలంలో బాగా వినిపించిన ఈ పేరు ఇది. ప్రభుత్వాలను మించి పెద్దమనసుతో పేదలకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు సోనూసూద్. కరోనా కారణం గా వింధించిన లాక్ డౌన్ వల్ల వేలాది మంది కార్మికులు గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందిపడుతున్న సమయంలో వారిపాలిట దేవుడు అయ్యాడు. బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు. అంతటితో సోను సాయం ఆగిపోలేదు. వేదికగా సాయం కోరిన ప్రతిఒక్కరికి తనవంతు సహాయం అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశ నలుమూలలనుంచి ఎవరు సాయం కోరిన సోనూసూద్ చేస్తూ వచ్చారు. సోను పెద్ద మనసుకు ఎన్నో అవార్డులు.. దేశమంతటా ప్రశంసలు దక్కాయి.ప్రస్తుతం బెడ్స్, ఆక్సిజన్ లేని కోవిడ్ పేషెంట్లకు సోనూసూద్ తన వంతు సహకారం అందిస్తున్నారు. సోనూసూద్‌ కోవిడ్‌ బాధితుల కోసం సొంతంగా ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా కోవిడ్‌ బాధితులకు మందులు, ఆక్సిజన్‌ పంపిణి చేస్తూ సమయానికి ఆదుకుంటున్నారు. దీంతో ఆయన ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చేందుకు పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. తాజాగా యాంకర్‌, ఐపీఎల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు హోస్ట్‌ వింధ్యా (Vindhya Vishaka) సైతం వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.

    తన దగ్గరున్న ఖరీదైన దుస్తులను వేళం వేసి వాటి ద్వారా వచ్చిన డబ్బులను సోనూ సూద్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసింది. ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని తన సహా నటీనటులకు ఆమె విజ్ఞప్తి చేసింది.






    ఈ విషయం తెలుసుకున్న యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ వింధ్యాను ప్రశంసలతో ముంచెత్తింది. "ఇది నిజంగా అద్బుతమైన ఆలోచన. నేను కూడా చేస్తాను. నీ వీడియోతో నాలో స్ఫూర్తిని నింపినందుకు థ్యాంక్స్‌ వింధ్య" అంటు పోస్టు షేర్‌ చేసింది. అది చూసి వింధ్యe.. "థ్యాంక్యూ అనూ నీ నుంచి ఇది ఊహించలేదు" అంటూ ఆమె మురిసిపోయింది. ఇక, స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగుతో పాటు పలు కార్యాక్రమాలకు, టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐపీఎల్‌ యాంకరింగ్‌ కోసం ముంబై వెళ్లిన ఆమె కోవిడ్‌ కారణంగా ఈ సీజన్‌ వాయిదా పడటంతో తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు