Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: November 6, 2020, 4:42 PM IST
బిగ్ బాస్ 4 తెలుగుకు ఐపిఎల్ పోటీ (bigg boss 4 telugu IPL)
బిగ్ బాస్ 4 తెలుగు మొదలై 9 వారాలు కావొస్తుంది. తొలివారం రికార్డు రేటింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత వారం కూడా పర్లేదు అనిపించింది. కానీ మూడో వారం ఐపిఎల్ మొదలైంది. అప్పట్నుంచి దీనికి భారీ పోటీ వచ్చేసింది. టీఆర్పీ రేటింగ్స్ అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా యావరేజ్ టిఆర్పీ మాత్రమే వస్తుంది. ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం మాత్రం ఊహించిన రేంజ్లో రావడం లేదని స్టార్ మా యాజమాన్యం కూడా నిరాశలో ఉన్నారు. బిగ్ బాస్ షోను ఎంత కలర్ ఫుల్‌గా నిర్వహిస్తున్నా కూడా రేటింగ్స్ విషయంలో మాత్రం ఎందుకో తెలియదు కానీ వెనకబడుతూనే ఉంది. ఊహించిన స్థాయిలో షోకు ఆదరణ దక్కడం లేదు. నాగార్జున వచ్చే వీకెండ్ ఎపిసోడ్స్ మాత్రమే కుమ్మేస్తున్నాయి. మొన్నటికి మొన్న సమంత వచ్చినపుడు రేటింగ్ కూడా భారీగానే వచ్చింది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 11.4 రేటింగ్ వచ్చింది. దసరా రోజు ఏకంగా 4 గంటల పాటు సాగిన ఈ ఎపిసోడ్‌కు ఇది మంచి రేటింగ్ అని చెప్పొచ్చు.

సమంత బిగ్ బాస్ (Samantha Bigg Boss host)
కానీ తర్వాత వీక్ డేస్ మొదలు కాగానే మళ్లీ వీక్ అయిపోయింది రేటింగ్. దాంతో మళ్లీ తల పట్టుకుంటున్నారు నిర్వాహకులు. ఎంతగా ప్రయత్నించినా.. ఎన్ని వైల్డ్ కార్డులు ఇప్పించినా.. గ్లామర్ షో చేయించినా.. టాస్కులు భారీగానే పెట్టినా కూడా రేటింగ్ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు అనుకోని వరం బిగ్ బాస్‌కు ఎదురైంది. అదే ఐపిఎల్ చివరిదశకు వచ్చేయడం. సెప్టెంబర్ 19న మొదలైన ఐపిఎల్ 8 వారాల తర్వాత ముగింపుదశకు వచ్చేసింది. నవంబర్ 10తో ఈ సీజన్ ముగిసిపోనుంది.

సమంత, నాగార్జున (Nagarjuna Samantha/Twitter)
ఇప్పటికే క్వాలిఫైయర్ మ్యాచులు కూడా మొదలయ్యాయి. నవంబర్ 6న హైదరాబాద్ వర్సెస్ బెంగళూర్.. నవంబర్ 8న రెండో ఎలిమినేటర్.. 10 ఫైనల్ జరగనున్నాయి. ఇవి అయిపోతే ఐపిఎల్ 13 ముగుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత బిగ్ బాస్‌కు పోటీ తగ్గిపోయినట్లే. కచ్చితంగా తర్వాత మళ్లీ రేటింగ్స్‌లో పుంజుకుంటుందని ఆశిస్తున్నారు నిర్వాహకులు. పైగా వచ్చే వారం మంగ్లీని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి హౌజ్‌లోకి పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Published by:
Praveen Kumar Vadla
First published:
November 6, 2020, 4:42 PM IST