Zee Telugu: కొత్త సంవత్సరాన్ని పార్టీకి వేళాయెరాతో ఆహ్వానం పలుకుతున్న పార్టీకి వేళాయెరా...

ప్రతీకాత్మకచిత్రం ( Zee Telugu)

జీ తెలుగు ఈ కొత్త సంవత్సరాన్ని ‘పార్టీ కి వేళాయెరా’అనే ఒక న్యూ ఇయర్ ఈవెంట్ తో మొదలుపెట్టి , 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 తో ముగించనుంది. నాలుగు గంటల సేపు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో డిసెంబర్ 27 న తెలుగు ప్రజలందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి జీ తెలుగు సిద్ధంగా ఉంది.

  • Share this:
    జీ తెలుగు ఈ కొత్త సంవత్సరాన్ని ‘పార్టీ కి వేళాయెరా’అనే ఒక న్యూ ఇయర్ ఈవెంట్ తో మొదలుపెట్టి , 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 తో ముగించనుంది. నాలుగు గంటల సేపు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో డిసెంబర్ 27 న తెలుగు ప్రజలందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి జీ తెలుగు సిద్ధంగా ఉంది. సరికొత్త సంవత్సరాన్ని జీ తెలుగుతో స్వాగతిస్తోంది. పార్టీ కి వేళాయెరా కార్యక్రమం శ్రీముఖి హోస్ట్ చేయగా, జీ తెలుగు కుటుంబమంతా కలిసి నూతన సంవత్సరాన్ని ఎంతో ఆహ్లాదంగా ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలో జీ తెలుగు కుటుంబానికి సంబందించిన నటులకు కొత్త రకమైన అవార్డ్స్ ఇవ్వనున్నారు. లేజీ లేడీ, స్లీపింగ్ స్పైడర్ అని ఫన్నీ అవార్డ్స్ బహుకరించునున్నారు. సీరియల్ యాక్టర్స్, స రి గ మ ప కంటెస్టెంట్స్ మరియు సద్దాం కలిసి 2020 గుడ్ బై పలికి తెలుగు టెలివిజన్ లోనే అతి పెద్ద కేక్ ని కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఎంతో ఉత్సాహంగా జరగనున్న ఈ వేడుక డిసెంబర్ 27 సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో ప్రసారం కానుంది.



    ఈ షోలో ప్రతిభావంతులైన కళాకారులు ప్రదర్శించే డేర్డెవిల్ యాక్ట్స్ పై సెలబ్రిటీలు పందెం వేస్తారు. తెలుగు టెలివిజన్ లోనే మునుపెన్నడు చూడని, వినని, కనని ప్రదర్శనలతోటి ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేయడానికి వస్తుంది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ సీజన్ 5 . అలాగే ఈ సారి సెట్ డిజైన్, మునిపెన్నడు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో చూడని, వాడని ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులని మైమరింపించడానికి జీ తెలుగు సిద్దమవుతుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా, రసవత్తరంగా ఉండే ఈ షో కి నవరసాలని పలికించే సుమ కనకాల మరియు ఎనర్జిటిక్ యాంకర్ రవి హోస్టుగా నిర్వహించనున్నారు.
    Published by:Krishna Adithya
    First published: