Home /News /movies /

INTRESTING STORY BEHIND DARSAKENDRUDU RAGHAVENDRA RAO FIRST MOVIE AS AN ACTOR MHN

Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా.. టైటిల్ వెనుక ఆసక్తికరమైన కథ

Intresting story behind Darsakendrudu Raghavendra Rao first movie as an actor

Intresting story behind Darsakendrudu Raghavendra Rao first movie as an actor

Raghavendra Rao - Movie Title: ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు.. శ‌తాధిక ద‌ర్శ‌కుడు. నాటి దివంగ‌త అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ నుండి నేటి కుర్ర హీరోల వ‌ర‌కు ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించి సెన్సేష‌న‌ల్ హిట్స్ అందించిన ద‌ర్శ‌కుడు.

ఇంకా చదవండి ...
    ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు.. శ‌తాధిక ద‌ర్శ‌కుడు. నాటి దివంగ‌త అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ నుండి నేటి కుర్ర హీరోల వ‌ర‌కు ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించి సెన్సేష‌న‌ల్ హిట్స్ అందించిన ద‌ర్శ‌కుడు. ‘ఓం న‌మో వెంకటేశాయ‌’ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌లేదు. ప్ర‌స్తుతం ‘పెళ్లి సంద‌డి’ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నాడు. అయితే ఈయ‌న త్వ‌ర‌లోనే న‌టుడిగా వెండితెర‌పై సంద‌డి చేయ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పాడు. ఇంత‌కీ త‌నికెళ్ల భ‌ర‌ణి ఎందుకా విష‌యం చెప్పాడ‌ని అనుకుంటున్నారా? ఎందుకంటే.. రాఘ‌వేంద్ర రావును న‌టుడిగా పెట్టి సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేది త‌నికెళ్ల‌భ‌ర‌ణియే. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో త‌నికెళ్ల‌భ‌ర‌ణి ఈ విష‌యాన్ని చెప్పాడు.

    రాఘ‌వేంద్ర‌రావు హీరోగా ముగ్గురు హీరోయిన్స్‌తో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. మ‌రి ఈ ద‌ర్శ‌కేంద్రుడి ప‌క్క‌న హీరోయిన్స్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే విష‌యాన్ని చూస్తే.. స‌మంత‌, శ్రియా శ‌ర‌న్ వంటి స్టార్ హీరోయిన్స్ పేర్లే ప్ర‌ముఖంగా వినిపించాయి. త్వ‌ర‌లోనే రాఘ‌వేంద్రుడి స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్స్ ఎవ‌ర‌నే సంగ‌తిపై క్లారిటీ రానుంది.

    తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ‘ఓ బాబూ..’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రాఘ‌వేంద్ర‌రావు ‘బాబు’ అనే చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యాడు కాబ‌ట్టి న‌టుడిగా కూడా ఆయ‌న చేయ‌బోతున్న తొలి చిత్రానికి అలాంటి టైటిల్‌ను పెడుతున్నార‌ని టాక్ వినిపిస్తోంది.
    Published by:Anil
    First published:

    Tags: K. Raghavendra Rao, Samantha, Shriya Saran

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు