Jabardasth Sathya Sri: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందులో వినోదాన్ని పంచే కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది సామాన్య వ్యక్తులను సెలబ్రేట్ లుగా మార్చింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా చేసింది.
Jabardasth Sathya Sri: బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో గురించి అందులో వినోదాన్ని పంచే కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ఎంతోమంది సామాన్య వ్యక్తులను సెలబ్రేట్ లుగా మార్చింది. అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకునేలా చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికీ ప్రసారం అవుతూనే ఉంది. ఇక ఈ షో మొదట్లో కంటే ఇప్పుడు చాలా మార్పులు చేసుకుంది. అంతేకాకుండా కాస్త కలర్ ఫుల్ గా కూడా కనిపిస్తుంది.
ఇందులో ఎక్కువగా భార్య భర్తల మధ్య, ఇద్దరు లవర్స్ మధ్య జరిగే ఫన్నీ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ షోలో అమ్మాయిలు కూడా అవసరమవుతారు. అలా గతంలో ఇందులో లేడీ గెటప్స్ వేసుకొని కొందరు తమ పర్ఫామెన్స్ లతో బాగా అదరగొట్టారు. కానీ ఈమధ్య లేడీ గెటప్ వేసుకునే కమెడియన్స్ అసలు కనిపించట్లేదు. కారణం ప్రస్తుతం లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. పైగా కొత్తవాళ్ళు పరిచయం అవుతున్నారు. ఇలా లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఎవరో కాదు మరో కమెడియన్ సత్య శ్రీ అనే చెప్పాలి.
జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే. ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన స్కిట్ లను చేస్తుంటాడు. ఇందులో ఈయన చేస్తున్న సమయంలో బుల్లితెర నటి సత్యశ్రీ ను పరిచయం చేశాడు. ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది. కానీ ఈమె గురించి ఎవరికీ పరిచయం లేదు. ఇక జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాక తనేంటో నిరూపించుకుంది. మరింత పరిచయాన్ని పెంచుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా అభిమానులను కూడా పెంచుకుంది.
జబర్దస్త్ లో తొలిసారిగా లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చమ్మక్ చంద్ర తో పాటు ఈమె కూడా బయటకి వెళ్ళిపోయింది. ఈమె తర్వాత జబర్దస్త్ లో ఎంతోమంది లేడీ కమెడియన్స్ పరిచయమయ్యారు. నిజానికి ఈమె ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకే లేడీ కమెడియన్స్ కు అవకాశాలు ఇచ్చారు. దాంతో ప్రస్తుతం బుల్లితెర నటులు రోహిణి, వర్ష, పవిత్ర లు ఎంట్రీ ఇచ్చి తమ కామెడీ లతో బాగా ఆకట్టుకుంటున్నారు. అలా సత్య శ్రీ వల్ల జబర్దస్త్ ప్రస్తుతం లేడీ కమెడియన్స్ తో కలర్ ఫుల్ గా మారింది.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.