హోమ్ /వార్తలు /సినిమా /

Anchor Prashanthi: యంగ్ హీరోతో యాంకర్ ప్రశాంతి పెళ్లి.. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ల నుంచి అంటూ?

Anchor Prashanthi: యంగ్ హీరోతో యాంకర్ ప్రశాంతి పెళ్లి.. ఈ రోజు కోసమే ఎన్నో ఏళ్ల నుంచి అంటూ?

anchor prasanthi

anchor prasanthi

Anchor Prashanthi: బుల్లితెరలో మంచి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఇందులో నెగెటివ్ రోల్ లో నటిస్తూ తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంటున్న నటి లాస్య అలియాస్ ప్రశాంతి.

Anchor Prashanthi: బుల్లితెరలో మంచి రేటింగ్ దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఇక ఇందులో నెగెటివ్ రోల్ లో నటిస్తూ తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంటున్న నటి లాస్య అలియాస్ ప్రశాంతి. ఒకప్పుడు టీవీ యాంకర్ గా పరిచయమైన ప్రశాంతి బుల్లితెర సీరియల్స్ వైపు అడుగు పెట్టి మంచి గుర్తింపు అందుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ సమాజంలో జరిగే వాటిపై కూడా స్పందిస్తూ ఉంటుంది.ఇక యాంకర్ గా చాలా ఏళ్లుగా చేసింది. ఇక ఆ తర్వాత వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది. కానీ వెండితెరపై మాత్రం తనకంటూ గుర్తింపు తెచ్చుకోలేదు. తాజాగా ఓ హీరో ని పెళ్లి చేసుకుంది ప్రశాంతి.

ఇక బుల్లితెర సీరియల్ ఇంటింటి గృహలక్ష్మిలో లాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. తన నటన ఏంటో నిరూపించింది. ఇదిలా ఉంటే ఓ హీరో ని పెళ్లి చేసుకుని కాస్త ఎమోషనల్ అయ్యింది ప్రశాంతి.అదేంటి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా.. ఇది నిజమైన పెళ్లి మాత్రం కాదండి. కేవలం ఉత్తుత్తి పెళ్లి.అది కూడా మన సుమక్క హోస్టింగ్ చేస్తున్న క్యాష్ షో లో ఈ పెళ్లి జరిగింది. తాజాగా క్యాష్ షో కి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో బుల్లితెర నటులు పాల్గొన్నారు.

శిరీష-సన్నీ, వాసుదేవ్ -కరుణ, పవన్- అంజలి, విశ్వ- ప్రశాంతి లు జంటలుగా వచ్చి బాగా సందడి చేశారు.ఇక సుమ కూడా వాళ్లపై తెగ పంచ్ లు వేసి నవ్వించింది. ఇదిలా ఉంటే ఇందులో పాల్గొన్న జంటలకు దండలు మార్పిస్తూ ఉత్తుత్తి పెళ్లి చేసింది. ఇక ఇందులో ప్రశాంతిని బాగా హైలెట్ చేయగా.. నీ బాయ్ ఫ్రెండ్ ను ఎంతకాలం దాచిపెట్టారు అని ప్రశ్నించింది సుమ. వెంటనే.. దాచి పెట్టుకొని పంపించిన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా? లేదా దాచిపెట్టుకున్న బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలా అని కౌంటర్ వేసింది ప్రశాంతి. ఇక తనకు కూడా బుల్లితెర హీరో విశ్వక్ తో దండ వేయించింది. విశ్వక్ కూడా ప్రశాంతి మెడలో దండ వేయగా ఫోటోలకు ఫోజులిచ్చారు.

anchor prashanthi

ఇక సుమ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. దీంతో ప్రశాంతి కాస్త ఎమోషనల్ అవుతూ.. ఈ రోజు కోసమే మా నాన్న ఎంతో కాలం వెయిట్ చేస్తున్నాడు అని తెలిపింది. వెంటనే సుమ ఈ నాన్నలు హమ్మయ్య మా అమ్మాయి సెటిల్ అయింది.. అని అనుకుంటారని ఓ కామెంట్ చేసింది. అంతేకాకుండా ప్రశాంతి ఇప్పుడు ఏడిస్తే ఐలాష్ పోతుందని వెయిట్ చేసింది.. మేకప్ తీసేశాక ఏడుస్తుంది అంటూ పంచ్ డైలాగ్ వేసింది సుమ.

First published:

Tags: Anchor prashanthi, Anchor prashanthi interview, Intinti gruhalakshmi, Kasthuri actress, Lasya, Nandhu

ఉత్తమ కథలు