గృహలక్ష్మీ సీరియల్ అందరికీ తెలిసింది. తెలుగింటి ఇల్లాలు ఈ సీరియల్ కోసం ప్రతీ రోజు ఎదురు చూస్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ సీరియల్ రేటింగ్లో కూడా దూసుకెళ్తుంది. ఇక ఈ సీరియల్లో మెయిన్ రోల్ చేస్తున్న నటి కస్తూరి గురించి కూడా మనకు తెలుసు... ఒకప్పుడు హీరోయిన్ అయిన కస్తూరి.. గృహలక్ష్మీ సీరియల్లో తులసి క్యారెక్టర్ చేస్తుంది. తులసి పాత్రలో కస్తూరి నటన అందర్నీ కట్టి పడేస్తోంది. అయితే తాజాగా కస్తూరి... శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు.. ప్రత్యేక అతిథిగా వచ్చింది.
ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ... సీరియల్స్ ఎప్పుడూ ఏడుస్తూ చూస్తే వాళ్లందర్నీ ఇక్కడ ఈ షోలో నవ్వుతూ చూసానన్నారు. కస్తూరి కూడా ఇక షోలో స్టేజ్ పై స్టెప్పులేసి అందర్నీ అలరించారు. బుట్ట బొమ్మ పాటకు అదరిపోయే స్టెప్పులేసింది కస్తూరి. దీంతో ఆమె పాటకు అక్కడున్న ఇతర సీరియల్ యాక్టర్స్ అంతా ఈలలు వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక సీరియల్లో ఎప్పుడూ సీరియస్ క్యారెక్టర్లో కనిపించే కస్తూరిని ఈ షోలో కొత్త లుక్లో చూసి టీవీ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కస్తూరి అలియాస్ తులసికి ఇంత టాలెంట్ ఉందా అంటూ షాక్ అవుతున్నారు.
కస్తూరి... తెలుగులో వచ్చిన అక్కినేని హీరో నాగార్జున్న నటించిన అన్నమయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత కూడా అనేక తమిళ సినిమాల్లో ఆడిపాడింది. కానీ ఈమెకు అవేవీ పనికిరాలేదనే చెప్పాలి. అందుకోసమే కస్తూరి ఇప్పుడు బుల్లితెర మీద తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఒకప్పుడు వెండి తెర మీద అందాల విందు చేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు బుల్లితెర మీద తన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.
స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లో కస్తూరి... తులసిగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ సీరియల్ విషయానికి వస్తే కస్తూరిది అందులో మధ్య తరగతి గృహిణి పాత్ర. మధ్య తరగతి గృహిణిలా కస్తూరి చక్కగా ఒదిగిపోయింది. ఈ సీరియల్ కు రేటింగ్స్ కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ సీరియల్ అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gruhalakshmi, Intinti gruhalakshmi serial, Sridevi drama company