Home /News /movies /

INTI GUTTU NEW SERIAL ON ZEE TELUGU SAI KIRAN MEENA VASU STARING STARTS FROM NOV 30 MK

Zee telugu: ఇంటి గుట్టుతో జీ తెలుగు బుల్లితెరపై కొత్త సీరియల్ త్వరలో ప్రారంభం...

ఇంటి గుట్టు సీరియల్ (zee telugu)

ఇంటి గుట్టు సీరియల్ (zee telugu)

జీ తెలుగు ఈసారి కూడా మరో కొత్త ధారావాహికతో అందరిని అలరించడానికి వస్తుంది. 'ఇంటి గుట్టు' అనే పేరుతో వచ్చే ఈ సీరియల్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, నవంబర్ 30 వ తేదీ నుంచి, సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2: 00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో ప్రసారం చేయబోతుంది.

ఇంకా చదవండి ...
    జీ తెలుగు ఈసారి కూడా మరో కొత్త ధారావాహికతో అందరిని అలరించడానికి వస్తుంది. 'ఇంటి గుట్టు' అనే పేరుతో వచ్చే ఈ సీరియల్ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ వారు ప్రొడ్యూస్ చేయగా, నవంబర్ 30 వ తేదీ నుంచి, సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2: 00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో ప్రసారం చేయబోతుంది. కథలోకి వెళితే... కళ్యాణి(నిసర్గ) తన కుటుంబానికి చెందిన గారాల పట్టి. అలాంటి ఒక్క అమ్మాయి కుటుంబాన్ని విడిచి తన తండ్రి తో (సాయి కిరణ్) అక్రమ సంబంధం పెట్టుకున్న అనుపమ(మీనా వాసు) ఇంటిలో అడుగు పెడుతుంది. అనుపమ అంటే కల్యాణికి ద్వేషం. విధి వక్రించడం చేత కల్యాణికి సంరక్షకురాలిగా అనుపమ మారుతుంది. మరి కళ్యాణి ఎవరినైతే ద్వేషిస్తుందో, వారి తోటి కలిసి ఉండగలుగుతుందా?ఏ బంధం లేని ఇద్దరు అపరిచితులు, తల్లీకూతురి అనుబంధానికి ఒక సరికొత్త ఆరంభం పలుకుతారా? అని తెలుసుకోవాలంటే ఇంటి గుట్టు చూడాల్సిందే.

    తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గుడూర్ మాట్లాడుతూ, "ఇంటి గుట్టు మునుపెన్నడూ చూడని తల్లి కూతుళ్ళ సంబంధం యొక్క కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతుంది. విధి యొక్క వక్రీకరణ కారణంగా ఇద్దరు అపరిచితులు ఒకరి జీవితాలలోకి మరొకరు ఇష్టం లేకుండా ప్రవేశిస్తారు. బంధాలు, భావోద్వేగాలు, అలాగే ప్రేమ కలిసిన ఈ సరికొత్త మధ్యహ్నాపు ధారావాహిక అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఇంటి గుట్టు ద్వారా, మా మధ్యహ్నాపు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులు మమ్మల్నిఇంకా ఆదరిస్తారని భావిస్తున్నాను." అని పేర్కొన్నారు. ఈ సీరియల్ లో ముఖ్య పాత్రదారులుగా రోహిత్, రూప, రజిత, గిరీష్, శివ పార్వతి, మల్లాధి, హేమంత్, రితు చౌదరి మరియు తదితరులు కీలక పాత్రలను పోషించారు.

    కల్యాణి మరియు అనుపమ యొక్క సరికొత్త అనుబంధాన్ని చూడటానికి నవంబర్ 30 నుంచి ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2:00 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానెళ్లలో తప్పక వీక్షించండి.

    ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే. మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Telugu tv serials

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు