త్రిష లవ్ మ్యారేజ్.. లాస్ వేగాస్‌లో పెళ్లి...

Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: March 25, 2020, 4:06 PM IST
త్రిష లవ్ మ్యారేజ్.. లాస్ వేగాస్‌లో పెళ్లి...
త్రిష Photo : Twitter
  • Share this:
Trisha Krishnan : త్రిష కృష్ణన్, 'నీమనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తరుణ్‌తో బాగానే ఆడిపాడింది. అయితే సినిమా అనుకున్నంత అలరించలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు రావాల్సినంత పేరు రాలేదు.  ఆ తర్వాత ప్రభాస్ సరసన 'వర్షం' సినిమాతో ఈ తమిళ పొన్ను అదరగొట్టింది.  ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అంతేకాకుండా సినిమా కూడ హిట్ అవ్వడంతో తెలుగులో ఆఫర్స్ విపరీతంగా వచ్చాయి. ఇక అప్పటి నుండి త్రిష సినిమాల కోసం ఎదురుచూసింది లేదు. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హిరోయిన్‌లలో ఒకరుగా ఉన్నారు త్రిష. వరుసగా 'వర్షం', 'నువ్వస్తానంటే నేనోదంటానా', 'అతడు' లాంటీ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో త్రిష తెలుగులో ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ మద్య కాస్తా వెనుకబడిన ఇటీవల తమిళంలో వచ్చిన '96'తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది త్రిష. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అవ్వడంతో  పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం వెండితెర అరంగేట్రం చేసిన చెన్నై చిన్నది త్రిష ఇప్పటికీ సినిమాలు చేస్తూ లైమ్‌లైట్‌లోనే ఉంది.

అది అలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన త్రిష తన పెళ్లి గురించి, కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. 'సౌత్‌లో అన్ని భాషల్లోనూ నాకు గుర్తింపు ఉంది. ఏ భాష నుంచి అవకాశం వచ్చినా తప్పకుండా నటిస్తాను. సినిమాల విషయాల కంటే కూడా నా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. నాకు తెలియకుండానే పెళ్లి గురించి, డేటింగ్ గురించి ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. నేను ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. అయితే నా పెళ్లి ఇక్కడ జరుగదు.. నాకు లాస్ వేగాస్ అంటే ఇష్టం. అక్కడే పెళ్లి చేసుకుంటాని చెప్పుకొచ్చింది త్రిష.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు