సర్కారు వారి పాట సక్సెస్ తర్వాత.. మహేష్(Mahesh Babu) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమాకు ఇంకా పేరు ఖరారు కాలేదు. అయితే ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ప్రకారం ఈ చిత్రానికి అర్జునుడు(Arjunudu) అనే పేరు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్ గతంలో అర్జున్ అనే సినిమా చేసాడు మరి అర్జునుడు ఫిక్స్ అవుతుందో లేదో చూడాలి. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. అతడు(Athadu) సినిమాలో మహేష్ బాబు(Mahesh Babu) నటించిన క్యారెక్టర్ పేరు పార్థు. ఈ సినిమాకు ఆ పేరు కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అతడు సినిమాను త్రి విక్రమై డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఖలేజా వచ్చింది. అయితే ఖలేజా మంచి టాక్ తెచ్చుకున్న అనుకున్న విజయం సాధించలేకపోయింది.
ఈ సినిమాను SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే మహేష్ డేట్స్ తీసుకున్న త్రివిక్రమ్ వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలపాలని ప్రయత్నిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2023 సంవత్సరం జనవరి 6వ తేదీన ఈ సినిమా విడుదల చేయాలనీ త్రివిక్రమ్ ఫైనల్ అయినట్లు టాక్.
మరోవైపు ప్రస్తుతానికి, మహేష్ తన కుటుంబంతో హాలిడే ట్రిప్ యూరప్‌లో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జులై నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. పూజా, మహేష్ కలిసి మహర్షి సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.