• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • INTERESTING THINGS ABOUT LOVE MARRIAGE OF ANCHOR SUMA AND RAJIV KANAKALA FULL DETAILS HERE HSN

HBD Suma Kanakala: రాజీవ్‌తో ప్రేమ పెళ్లికి ఒకే ఒక్క కండీషన్ పెట్టిన దేవదాస్ కనకాల.. నేరుగా సుమ ఫోన్ చేసి చెప్తే..

రాజీవ్ కనకాల, సుమ, దేవదాస్ కనకాల (ఫైల్ ఫొటోలు)

రాజీవ్ కనకాలతో సుమ ప్రేమ పెళ్లి అంత ఈజీగా జరగలేదండోయ్. మీ అబ్బాయి నేను ప్రేమించుకుంటున్నామంటూ సుమ ఫోన్ చేసి దేవదాస్ కనకాలకు చెప్పింది. దీంతో ఆయన వెంటనే..

  • Share this:
    యాంకర్ సుమ. మాటల మాంత్రికురాలు. సెటైరికల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్. ఆమె యాంకరింగ్ కు ఫిదా అవని వాళ్లు ఉండనే ఉండరు. లేడీ యాంకర్ గా టాలీవుడ్ ను దున్నేస్తోంది. అటు టీవీ షోలయినా, ఇటు సినిమా ఫంక్షన్లు అయినా సుమదే హవా. ‘సుమక్క తర్వాతే మేము ఎవరిమైనా‘ అంటూ యాంకర్లందరూ ముక్తకంఠంతో ఒప్పేసుకుంటారు. సోమవారం (మార్చి 22వ తారీఖు) సుమ పుట్టిన రోజు. ఈ రోజుతో 46ఏళ్ల పడిలోకి ఆమె అడుగుపెట్టారు. అటు యాంకర్ గా తన వృత్తిలో రాణిస్తూ, ఇటు ఇల్లాలిగానూ తన కుటుంబానికి తోడు నీడలా ఉన్నారు. యాంకర్ సుమది ప్రేమ పెళ్లి అని అందరికీ తెలిసిందే. తెలుగువాడైన రాజీవ్ కనకాల, మలయాళీ అయిన సుమ ప్రేమ పెళ్లి చేసుకోవడం అప్పట్లోనే ఓ సెన్సేషన్. అయితే వారి ప్రేమ పెళ్లి ఎలా జరిగింది.? ఇంట్లో వాళ్లకు ఒప్పుకున్నారా? లేదా? అన్న సంగతులపై ఓ ప్రత్యేక కథనం.

    రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల సినీ నటులకు శిక్షణ ఇచ్చేవారన్న సంగతి తెలిసిందే. అటు చిరంజీవి దగ్గర నుంచి రజనీకాంత్ వరకు మెజారిటీ హీరోలు ఆయన దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్నవాళ్లే. రాజీవ్ కనకాల కూడా మొదట్లో సీరియల్స్ తో కెరీర్ ను మొదలు పెట్టాడు. 1994వ సంవత్సరంలోనే సుమకు ప్రేమ సందేశాన్ని పంపాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత 1999లో వారి ప్రేమ పెళ్లి జరిగింది. వీళ్ల ప్రేమ పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదండోయ్. వారి మధ్య ప్రేమ గురించి రాజీవ్ కనకాల తల్లిదండ్రులకు మొదట సుమే చెప్పింది. వారి పెళ్లికి దేవదాస్ కనకాల ఓ కండీషన్ కూడా పెట్టారు. ఈ విషయాలను దేవదాస్ కనకాల గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    ‘మీ అబ్బాయి, నేను ప్రేమించుకుంటున్నాం. మీరు అంగీకరిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. అని ఓ రోజు సుమ నాకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటికే వారి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు మేం గ్రహించాం. అయితే సుమకు మాత్రం ఓ విషయం క్లారిటీగా చెప్పాను. ‘నువ్వు మీ అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతురివి. మీ వాళ్లు ఒప్పుకుంటేనే రాజీవ్ తో నీ పెళ్లి జరుగుతుంది. లేదంటే మాత్రం ఈ పెళ్లి గురించి మర్చిపో‘ అని ఒకే ఒక్క కండీషన్ పెట్టా. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ, కొద్ది రోజుల తర్వాత సుమ వాళ్ల నాన్న మా ఇంటికి వచ్చారు. మాట్లాడి వాళ్లిద్దరికీ 1999వ సంవత్సరంలో పెళ్లి చేశాం‘ అని దేవదాస్ కనకాల చెప్పుకొచ్చారు. సుమ ఫాదర్ ఇన్ లా అని అప్పుడప్పుడు తనను కొందరు పిలుస్తుంటారనీ, ఆ సమయంలో తనకు చాలా గర్వంగా ఉంటుందని ఆయన వివరించారు.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published: