• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • INTERESTING STORY BEHIND MR PERFECT MOVIE TITLE AND ITS REGISTERED FOR MAHESH BABU NOT PRABHAS PK

Mahesh Babu - Prabhas: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ప్రభాస్ కాదు మహేష్ బాబు.. టైటిల్ బిహైండ్ స్టోరీ తెలుసా..?

Mahesh Babu - Prabhas: ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ప్రభాస్ కాదు మహేష్ బాబు.. టైటిల్ బిహైండ్ స్టోరీ తెలుసా..?

ప్రభాస్ మహేష్ బాబు (Prabhas Mahesh Babu)

Mahesh Babu - Prabhas: ఓ హీరో కోసం అనుకున్న టైటిల్ మరో హీరోకు వెళ్లడం కామన్. అలా ఎన్నో టైటిల్స్ ఒకరి చేతుల్లోంచి మరొకరికి వెళ్లిపోయాయి. కాటమరాయుడు అప్పట్లో కమెడియన్ సప్తగిరి రిజిష్టర్ చేయించుకున్నాడు.

  • Share this:
ఓ హీరో కోసం అనుకున్న టైటిల్ మరో హీరోకు వెళ్లడం కామన్. అలా ఎన్నో టైటిల్స్ ఒకరి చేతుల్లోంచి మరొకరికి వెళ్లిపోయాయి. కాటమరాయుడు అప్పట్లో కమెడియన్ సప్తగిరి రిజిష్టర్ చేయించుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అడిగాడని దాన్ని ఇచ్చేసాడు. రచ్చ కూడా అప్పట్లో ఎన్టీఆర్ కోసం అనుకున్నారు.. కానీ అది రామ్ చరణ్‌కు వెళ్లింది. ఎమ్మెల్యే కూడా హరీష్ శంకర్ అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కోసం రిజిష్టర్ చేసాడు కానీ కళ్యాన్ రామ్ ఆ టైటిల్‌తో సినిమాను చేసాడు. అచ్చంగా అలాగే మహేష్ బాబు కోసం అనుకున్న టైటిల్‌తో అప్పట్లో ప్రభాస్ ఓ సినిమా చేసాడు. పదేళ్ళ కింద దశరథ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గుర్తుంది కదా..? డార్లింగ్ లాంటి క్లాస్ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్. అయితే ఈ సినిమా టైటిల్ వెనక ఆసక్తికరమైన కథ ఉంది. కుటుంబ కథా చిత్రంగా వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ 30 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఆ సమయానికి అదే. ఈ సినిమా టైటిల్ ముందుగా అనుకున్నది మహేష్ బాబు కోసం. ప్రముఖ నిర్మాణ సంస్థ RR మూవీ మేక‌ర్స్ ఈ టైటిల్ రిజిస్ట‌ర్ చేయించారు కూడా. దర్శకుడు సురేందర్ రెడ్డి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఈ సినిమా ప్లాన్ చేసారు. అప్పటికే అతిథి లాంటి ఫ్లాప్ ఈ కాంబినేషన్‌లో వచ్చినా కూడా కథ బాగుండటంతో మరోసారి సురేందర్ రెడ్డికి ఓకే చెప్పాడు మహేష్ బాబు.

Mahesh Babu,Prabhas,Mahesh Babu twitter,prabhas twitter,Mahesh Babu prabhas movies,Mahesh Babu mr perfect movie,prabhas mr perfect movie title,mr perfect title for mahesh babu,rr movie makers mahesh babu mr perfect title,telugu cinema,ప్రభాస్,మహేష్ బాబు,మహేష్ బాబు మిస్టర్ పర్ఫెక్ట్,ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్
మహేష్ బాబు వర్సెస్ ప్రభాస్ (Twitter/Photo)


మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమా కథపై మహేష్ చాలా ఆసక్తి చూపించాడు. మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ అనుకుని RR మూవీ మేక‌ర్స్ రిజిష్టర్ చేయించారు. భారీ బడ్జెట్‌తో ఆ సినిమాను నిర్మించడానికి ఆర్ఆర్ మూవీ మేకర్స్ ప్లాన్ చేసారు. ఈ సినిమా కోసం అప్పట్లో మహేష్ బాబుకి 2.5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే అదే సమయంలో RR మూవీ మేక‌ర్స్‌కు ఆర్థిక ఇబ్బందులు రావడంతో సినిమా ఆగిపోయింది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ మాత్రం అలాగే ఉండిపోవడంతో స్వయంగా ఈ టైటిల్‌ తనకు కావాలని నిర్మాత వెంకట్‌ను ప్రభాస్ కోరాడు. దాంతో ఆయన కూడా కాదనకుండా ఇచ్చేసాడు.

Mahesh Babu,Prabhas,Mahesh Babu twitter,prabhas twitter,Mahesh Babu prabhas movies,Mahesh Babu mr perfect movie,prabhas mr perfect movie title,mr perfect title for mahesh babu,rr movie makers mahesh babu mr perfect title,telugu cinema,ప్రభాస్,మహేష్ బాబు,మహేష్ బాబు మిస్టర్ పర్ఫెక్ట్,ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్
మహేష్ బాబు ప్రభాస్ (Mahesh Babu Prabhas)


దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా వచ్చి విజయం సాధించింది. RR మూవీ మేకర్స్‌తో తాను తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చేసాడు మహేష్ బాబు. కానీ మాటిచ్చాడు కాబట్టి 2012లో అదే నిర్మాణ సంస్థకు బిజినెస్ మేన్ సినిమా చేసాడు. మరోవైపు మహేష్ బాబు సినిమా ఆగిపోయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఊస‌ర‌వెల్లిని మొదలు పెట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మహేష్ కోసం సురేందర్ రెడ్డి రాసుకున్న మాఫియా స్టోరీ ఇప్పటికీ అలాగే ఉంది. మరి ఎప్పటికైనా ఆ సినిమా వస్తుందో రాదో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు