ఒక్కడు సినిమాలో విలన్ ప్రకాశ్ రాజ్ కాదు.. ఎవరో తెలుసా..?

ఒక్కడు: మహేష్ బాబును తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ ముందు ఈ సినిమాను ప్రభాస్‌తో చేయాలనుకున్నాడు. ప్రభాస్, కృష్ణంరాజులకు కథ కూడా వినిపించిన తర్వాత స్క్రిప్ట్ ఎందుకో రిస్క్ అనిపించడంతో నో చెప్పాడంటారు.

Mahesh Babu Okkadu: తెలుగు ఇండస్ట్రీలోని ఆల్‌టైమ్ గ్రేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో ఒక్కడు కూడా ఉంటుంది. అప్పట్లోనే 100 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం.

  • Share this:
మహేష్ బాబు కెరీర్‌ను రాత్రికి రాత్రే మార్చేసి స్టార్ హీరోగా చేసిన సినిమా ఒక్కడు. అప్పటి వరకు ఈయన కూడా ఓ హీరో.. కృష్ణ వారసుడు అంతే. కానీ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించి పెట్టిన సినిమా మాత్రం ఒక్కడు. తెలుగు ఇండస్ట్రీలోని ఆల్‌టైమ్ గ్రేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌లో ఒక్కడు కూడా ఉంటుంది. అప్పట్లోనే 100 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది ఈ చిత్రం. ఫ్యాక్షన్ నేపథ్యానికి కబడ్డి టచ్ ఇచ్చి.. గుణశేఖర్ తెరకెక్కించిన ఈ ప్రేమకథ సంచలన విజయం సాధించింది. మహేష్ బాబు, భూమిక కెమిస్ట్రీ.. ప్రకాశ్ రాజ్ విలనిజం సినిమాకు హైలైట్.
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)

ఈ సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసిన ప్రకాశ్ రాజ్ ముందు ఒక్కడు సినిమాలో లేడు.. ఆయన్ని అసలు దర్శకుడు గుణశేఖర్ కూడా అనుకోలేదు. ఈ పాత్ర కోసం హీరో గోపీచంద్ పేరును పరిశీలించారు దర్శక నిర్మాతలు. ఆయన పేరే ముందు వరసలో ఉంది కూడా. అప్పటికి టాలీవుడ్‌లో క్రేజీ విలన్‌గా రప్ఫాడిస్తున్నాడు గోపీచంద్. జయం సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన.. నిజం సినిమాలో కూడా విశ్వరూపం చూపించాడు. అయితే ఒక్కడులో గోపీచంద్‌ను విలన్‌గా తీసుకోవాలనుకున్నాడు మహేష్ బాబు వద్దన్నాడు.
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)

దానికి కూడా కారణం ఉంది. అప్పటికి నిజం సినిమా సెట్స్‌పై ఉంది. అందులో కూడా గోపీచంద్ విలన్‌గా నటించాడు. దాంతో ఒకేసారి రెండు సినిమాల్లోనూ ఒకే హీరో.. ఒకే విలన్ అంటే చూసేవాళ్లకు బాగోదని మహేష్ అభ్యంతరం చెప్పడంతో కన్విన్స్ అయిన దర్శక నిర్మాతలు ప్రకాశ్ రాజ్‌ను తీసుకొచ్చారు. అలా ఓబుల్ రెడ్డి పాత్రను గోపీచంద్ మిస్ అయ్యాడు.
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)
ఒక్కడు సినిమా పోస్టర్స్ (okkadu movie)

ఆ తర్వాత ఒక్కడు బ్లాక్ బస్టర్ అయితే.. నిజం డిజాస్టర్ అయింది. కానీ గోపీచంద్ పాత్ర మాత్రం బాగా పేలింది. ఒక్కడు సినిమాలో గోపీచంద్‌కి అవకాశం ఇవ్వలేకపోయామనే ఫీలింగ్ నిర్మాత ఎమ్మెస్ రాజులో ఉందని.. అందుకే వెంటనే ప్రభాస్‌తో చేసిన వర్షం సినిమాలో ఆయన్నే విలన్‌గా తీసుకున్నారు. ఇది కూడా సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో ఆయన హీరో అయ్యాడు. అప్పట్నుంచి యాక్షన్ హీరోగా సత్తా చూపిస్తున్నాడు ఈ హీరో.
Published by:Praveen Kumar Vadla
First published: