Kiara Advani: కియారా అద్వానీ అసలు పేరేంటో తెలుసా...ఇంట్రెస్టింగ్ స్టోరీ

కియారా అద్వానీ(ఫైల్ ఫోటో)

Kiara advani: తనకు ఈ స్థాయిలో పేరు రావడానికి కారణం తన పేరే అని రివీల్ చేసింది కబీర్ సింగ్ బ్యూటీ కియారా అద్వానీ.

  • Share this:
    ఒక్కే ఒక్క సినిమాలో బాలీవుడ్ డార్లింగ్‌గా మారిపోయింది కియారా అద్వానీ. అంతకుమందు ఎన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు... కబీర్ సింగ్ సినిమాతో దక్కించుకుంది ఈ హాట్ బ్యూటీ. ఫగ్లీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. తన సెకండ్ సినిమా ఎంఎస్ ధోనితో ఆకట్టుకుంది. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్ నుంచి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ కావడంతో అమ్మడిని ఆడియెన్స్ గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అదే సమయంలో కబీర్ సింగ్ సినిమాలో కియారా హీరోయిన్‌గా నటించడం... సినిమాలో లిప్ లాక్ సీన్లలో తెగ రెచ్చిపోవడంతో కుర్రకారును ఈమెను తెగ లైక్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో చేతి నిండా ఆఫర్లు ఉన్న కియారా అద్వానీ... తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

    తనకు ఈ స్థాయిలో పేరు రావడానికి కారణం తన పేరే అని రివీల్ చేసింది కబీర్ సింగ్ బ్యూటీ. కియారా అసలు పేరు అలియా అద్వానీ. అయితే ఆమె ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే నాటికే అలియా భట్ పాపులర్ హీరోయిన్‌గా ఉండటంతో... తన పేరు ముందు కియారా చేర్చుకుంది. కియారా అలియా అద్వాని అని తన పేరు మార్చుకుంది. అయితే అందరూ కియారా అని పిలవడంతో... ఆమెలోని అలియా వెనక్కి వెళ్లిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ కియారా అనే పేరు పెట్టుకోవడం వెనుక కూడా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. 2010 లో వచ్చిన అంజనా అంజాని సినిమాలో ప్రియాంక చోప్రా పేరు కియారా. ఆ పేరును తన పేరుగా పెట్టుకోవాలని డిసైడయిన కియారా... ఇప్పుడు ఆ పేరు తనకు కలిసిరావడంపై కూడా ఫుల్ హ్యాపీగా ఉంది.




    Published by:Kishore Akkaladevi
    First published: