• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • INTERESTING STORY ABOUT SAI PALLAVI SARANGA DARIA SONG AND HOW THE SONG CAME TO BE INCLUDED IN THE SEKHAR KAMMULA LOVE STORY FILM SSR

Saranga Daria Song: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘సారంగ దరియా’ పాడాల్సింది మంగ్లీ కాదా.. ఈ పాట వదులుకున్న సింగర్ ఎవరో తెలిస్తే...

Saranga Daria Song: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘సారంగ దరియా’ పాడాల్సింది మంగ్లీ కాదా.. ఈ పాట వదులుకున్న సింగర్ ఎవరో తెలిస్తే...

మంగ్లీ, సాయిపల్లవి

యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘సారంగ దరియా’ పాడాల్సింది మంగ్లీ కాదా.. ఈ పాట వదులుకున్న సింగర్ ఎవరో తెలిస్తే... మల్లు కుట్టి సాయిపల్లవి నర్తించిన తెలంగాణ జానపద పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితాలో నంబర్.1 స్థానంలో నిలిచింది. ‘సారంగ దరియా’ అంటూ సాగిపోయే ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 10 మిలియన్ల మందికి పైగా వీక్షించారంటే ఏ స్థాయిలో ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో...

  • Share this:
    మల్లు కుట్టి సాయిపల్లవి నర్తించిన తెలంగాణ జానపద పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ జాబితాలో నంబర్.1 స్థానంలో నిలిచింది. ‘సారంగ దరియా’ అంటూ సాగిపోయే ఈ పాటను యూట్యూబ్‌లో ఇప్పటివరకూ 10 మిలియన్ల మందికి పైగా వీక్షించారంటే ఏ స్థాయిలో ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఫిదా’లో కూడా ‘పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే’ అని అచ్చ తెలుగు ముచ్చటైన పదాలతో ఉన్న పాటకు కూడా అప్పట్లో అనూహ్య స్పందన దక్కింది. శేఖర్ కమ్ముల సెంటిమెంట్‌గా భావించాడో.. లేదో కథానుగుణంగా అలాంటి పాట ఉండాలనుకున్నాడో తెలియదు గానీ నాగచైతన్య, సాయిపల్లవితో తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలో కూడా ‘సారంగ దరియా’ జానపద పాటకు ఈ మలయాళ ముద్దుగుమ్మతో ముచ్చటైన స్టెప్పులేయించాడు.

    ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి విడుదలయి ఇంతలా ఆకట్టుకుంటున్న ఈ ‘సారంగ దరియా’ పాటను ఆలపించింది మంగ్లీనే అయినా.. ఈ జానపద పాట గతంలోనే ఎంతోమంది పల్లె గాయనిల గొంతు నుంచి జాలువారింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మనసులను ఇప్పుడు కొల్లగొట్టిన ఈ ‘సారంగ దరియా’ పాట వెనుక ఆసక్తికరమైన కథే ఉంది. ఈ పాటకు తొలుత 2010లో ‘రేలా రే రేలా’ అనే జానపద పాటల కార్యక్రమంతో ఆదరణ దక్కింది. ఆ ప్రోగ్రాంలో ‘సారంగ దరియా’ పాటను పాడిన జానపద గాయని పేరు కోమల. అప్పట్లో ఈమె పాడిన ఈ పాట పల్లె జనాల హృదయాలను గెలుచుకుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘సారంగ దరియా’ పాట సినిమా ద్వారా ఇంత ఆదరణ దక్కించుకోవడంపై ఆ పాట పాడిన కోమల స్పందించింది.

    Sai Pallavi, Saranga Daria Song, Telangana Folk Songs, Sekhar Kammula, Love Story, Mangli, RelaReRela Komala
    ‘రేలారేరేలా’ కోమల


    2008లో తొలిసారిగా.. తన అమ్మమ్మ ఈ పాట పాడుతుండగా విన్నానని ఆమె చెప్పింది. ఆ తర్వాత.. చాలాచోట్ల పొలాల్లో పనికెళ్లిన కొందరు మహిళలు పాడగా విన్నానని తెలిపింది. ఈ పాటకున్న అర్థాన్ని ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒక గడుసు పిల్ల మనసు గెలుచుకోవడం అంత సులభం కాదని చెప్పడమని కోమల చెప్పింది. ఈ పాట అర్థాన్ని తెలుసుకున్న తర్వాత తాను కూడా ఈ పాటను పాడాలని నిర్ణయించుకున్నానని, తనకు ‘రేలారేరేలా’ ద్వారా ఆ అవకాశం దక్కిందని ఆమె చెప్పింది. ఈ పాటకు లిరిక్స్ అందించిన సుద్దాల అశోక్ తేజ ముందే ఈ పాటను కోమల పాడటం విశేషం. కోమల పాటకు ఆ షోలో న్యాయ నిర్ణేతలుగా ఉన్న వారి నుంచి విశేష ప్రశంసలు దక్కాయి.

    Sai Pallavi, Saranga Daria Song, Telangana Folk Songs, Sekhar Kammula, Love Story, Mangli, RelaReRela Komala
    సాయి పల్లవి


    ఆ షోలో.. ఈ పాటను వీలైనంత ఉన్నత స్థాయికి తీసుకెళతానని, అమితమైన ఆదరణ దక్కేలా చేస్తానని సుద్దాల అశోక్ తేజ కోమలకు మాటిచ్చాడు. ఇన్నేళ్ల తర్వాత.. ‘లవ్‌స్టోరీ’ సినిమా ద్వారా ‘సారంగ దరియా’ పాటకు ఊహించని ఆదరణ దక్కింది. సుద్దాల అశోక్ తేజ మాట నిజమైంది. అసలు.. వాస్తవంగా ‘లవ్‌స్టోరీ’ సినిమా నుంచి విడుదలైన ఈ ‘సారంగ దరియా’ పాటను పాడే అవకాశం తొలుత కోమలకే దక్కింది. అయితే.. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేకపోవడంతో చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఈ ఆఫర్‌ను కోమల సున్నితంగా తిరస్కరించింది. అలా.. ఈ పాట పాడే అవకాశం మంగ్లీని వరించింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు