దేశముదురు అల్లు అర్జున్ కాదంట.. అసలు హీరో ఎవరంటే..

అల్లు అర్జున్‌కు సూపర్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా దేశముదురు. పన్నెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2019, 2:45 PM IST
దేశముదురు అల్లు అర్జున్ కాదంట.. అసలు హీరో ఎవరంటే..
దేశముదురు పూరీ జగన్నాథ్
  • Share this:
అల్లు అర్జున్‌కు సూపర్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా దేశముదురు. పన్నెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం 2007లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది. సినిమా పక్కా మాస్‌గా ఉండటంతో ప్రేక్షకులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. దానికి తోడు పూరీ డైలాగులు.. హన్సిక అందాలు.. అల్లు అర్జున్ డైనమిక్ యాక్షన్.. అలీ కామెడీ ట్రాక్ అన్నీ కలిపి అదరగొట్టింది దేశముదురు. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్‌లో అదే పెద్ద హిట్. అయితే ఈ చిత్రంలో ముందు హీరో అల్లు అర్జున్ కాదు.. పూరీ జగన్నాథ్ ఈ కథను మరో హీరోకు కూడా చెప్పాడు.
Interesting facts behind Puri Jagannadh Allu Arjun blockbuster Desamuduru movie pk అల్లు అర్జున్‌కు సూపర్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా దేశముదురు. పన్నెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన.. puri jagannadh,allu arjun,allu arjun twitter,puri jagannadh twitter,desamuduru movie,desamuduru movie sumanth,puri jagannadh sumanth desamuduru,telugu cinema,అల్లు అర్జున్,దేశముదురు,పూరీ జగన్నాథ్ దేశముదురు,తెలుగు సినిమా,సుమంత్ దేశముదురు
దేశముదురు పూరీ జగన్నాథ్

ఆయనే హీరో అనుకున్నాడు కూడా.. కానీ అనుకోకుండా బన్నీ వచ్చేసాడు. ముందు ఈ కథను ఏ హీరోకు చెప్పాడో తెలుసా.. సుమంత్. అవును.. అక్కినేని మేనల్లుడికే ఈ కథను పూరీ ముందు చెప్పాడు. అప్పటికి సత్యం, గౌరి, మధుమాసం, గోదావరి లాంటి సినిమాలతో సుమంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో పూరీ దేశముదురు కథను ఆయనకు చెప్పాడు. అయితే హీరో సన్యాసిని ప్రేమించడం ఏంటి.. అసలు అలా జరుగుతుందా ఎక్కడైనా అంటూ సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేసాడు.

Interesting facts behind Puri Jagannadh Allu Arjun blockbuster Desamuduru movie pk అల్లు అర్జున్‌కు సూపర్ మాస్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా దేశముదురు. పన్నెండేళ్ల కింద పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రభాస్ యోగితో పాటే సంక్రాంతికి విడుదలైన.. puri jagannadh,allu arjun,allu arjun twitter,puri jagannadh twitter,desamuduru movie,desamuduru movie sumanth,puri jagannadh sumanth desamuduru,telugu cinema,అల్లు అర్జున్,దేశముదురు,పూరీ జగన్నాథ్ దేశముదురు,తెలుగు సినిమా,సుమంత్ దేశముదురు
సుమంత్ పూరీ జగన్నాథ్

పూరీ ఈ కథ చెప్పేటప్పటికీ దేశముదురు కథ పూర్తిగా రాయలేదు. జస్ట్ లైన్ మాత్రమే చెప్పడంతో నచ్చలేదు.. కానీ ఫుల్ నెరేషన్ ఇచ్చుంటే బన్నీ కాకుండా తానే ఈ సినిమా చేసుండేవాడినేమో అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సుమంత్. ఏదేమైనా కూడా కథను తక్కువంచనా వేసి ఓ బ్లాక్ బస్టర్ సినిమా వదిలేసుకున్నాడు సుమంత్.

First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు