news18-telugu
Updated: December 2, 2020, 5:30 PM IST
నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అగ్ర కథానాయకుడు కెరీర్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. బాలకృష్ణ ఎందరో డైరెక్టర్స్‌తో కలిసి వర్క్ చేశారు. కానీ డైరెక్టర్ బి.గోపాల్‌తో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్సెపెక్టర్ సినిమాలు రూపొందితే,ఈ రెండు సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్ మూవీస్‌గా నిలిచాయి. దాదాపు ఏడేళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందిన సినిమానే సమరసింహారెడ్డి. రాయలసీమలోని ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్మూవీస్లో ఒకటిగా నిలవడమే కాదు.. తెలుగు సినిమా రికార్డులను అప్పట్లో తిరగ రాసింది.
చెంగల వెంకటరావు అనే వ్యాపారవేత్త నిర్మాతగా మారి చేసిన ఈ సినిమా అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఎందుకంటే నిర్మాత వెంకట్రావు ఖర్చుకు వెనుకాడకుండా ఖర్చు పెట్టడమే. నిర్మాత అంటే అప్పటి వరకు అచి తూచి రూపాయి ఖర్చు పెట్టేవాడు. కానీ చెంగల వెంకట్రావు సినిమాను భారీగానే నిర్మించాడు. సినిమా పూర్తయిన తర్వాత ఏ టైటిల్ పెట్టాలనే దానిపై పెద్ద చర్చే జరిగింది. దర్శకుడు బి.గోపాల్, నిర్మాత చెంగల వెంకట్రావు, హీరో బాలకృష్ణ అందరూ బాగానే డిస్కషన్ చేసుకున్నారు. రాయలసీమలో సమరసింహారెడ్డి అనే యువకుడి కథ కాబట్టి.. దాన్నే టైటిల్‌గా పెడదామనే ఆలోచన వచ్చింది. అయితే రెడ్డి అంటే ఓ సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. అప్పటి వరకు సామాజిక వర్గాన్ని సూచించేలా టైటిల్స్ లేవు. మరి సమరసింహారెడ్డి అనే టైటిల్‌ను పెడితే , ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని దర్శకుడు గోపాల్ ఆలోచనలో పడ్డాడు. అయితే అప్పటికే సీనియర్ ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి సినిమా చేసున్నారు. ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్. అందులో చౌదరి అనేది ఓ సామాజిక వర్గాన్ని తెలియజేసే పదమే. అప్పట్లో ఎలాంటి సమస్యా రాలేదు కాబట్టి.. ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య రాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. అయితే చాలా తర్జనభర్జనల తర్వాతే టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
సినిమాలో క్యారెక్టర్ పేరు అదే కావడంతో కుల ప్రస్తావన గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందంటే.. దీని తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రూపొందడానికి కారణంగా నిలిచింది. తర్వాత బాలకృష్ణ, గోపాల్ కాంబినేషన్లో నరసింహనాయుడు సినిమా రూపొందింది. ఇందులో కూడా నాయుడు..ఓ సామాజిక వర్గాన్ని సూచించేదే. అయితే సమరసింహారెడ్డి సక్సెస్ కావడంతో ఈ టైటిల్‌ను పెట్టే సమయంలో పెద్దగా ఆలోచించుకోలేదు. తర్వాత బాలయ్య చేసిన మరో సినిమాకు విజయేంద్ర వర్మ అనే టైటిల్‌ను పెట్టారు.
Published by:
Anil
First published:
December 2, 2020, 5:30 PM IST