తెలుగు ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కూడా ఉంటారు. తొమ్మిదేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా వార్తల్లో నిలవలేదు ఈ జంట. అంత అన్యోన్యంగా కనిపిస్తుంటారు. ఇద్దరు పిల్లలతో హాయిగా తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ. ఎప్పటికప్పుడు బయట టూర్స్ వెళ్తూ పూర్తిగా ఫ్యామిలీ మెన్ అయిపోయాడు అల్లు అర్జున్. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రేమకథ అసలు ఎలా మొదలైంది.. ఎన్నాళ్ల నుంచి ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత పెళ్లికి ఎలా ఒప్పించారు అనేదానిపై సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన కథనాలు బయటికి వస్తున్నాయి. అందులో బన్నీ, స్నేహా లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ముఖ్యంగా స్నేహను చూసిన తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు అల్లు వారబ్బాయి. ఆ తర్వాత వెంటపడి మరీ తన ప్రేమను గెలిపించుకున్నాడు. అసలెప్పుడు ఈ కథకు బీజం పడిందనేది తెలియాలంటే కొన్నేళ్లు ముందుకెళ్లాలి. అప్పటికే బన్నీ ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరో అయిపోయాడు. మరోవైపు ఇంట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఆ సమయంలోనే తన ప్రేమసంగతి చెప్పి మనసిచ్చిన అమ్మాయితోనే మనువు వరకు వెళ్లిపోయాడు అల్లు అర్జున్.
అయితే స్నేహా రెడ్డిని తొలిసారి ఎక్కడ చూసాడో తెలుసా..? అర్ధరాత్రి పబ్‌లో చూసాడని సన్నిహితులు చెప్తుంటారు. అంత రాత్రి పూట స్నేహాను చూసి ఆమెలో అప్పుడే ఏదో స్పార్క్ కనిపెట్టాడు బన్నీ. నచ్చిన అమ్మాయి దొరగ్గానే మన సినిమాల్లో చూపించినట్లు గుండెల్లో గంటలు మోగుతాయి చూడు అలా బన్నీకి కూడా జరిగింది. దాంతో అక్కడ్నుంచే తన ప్రేమకథకు ముహూర్తం పెట్టాడు.
అసలే స్టైలిష్ స్టార్.. పైగా మంచి కుటుంబం కూడా ఉంది.. ఇంక స్నేహారెడ్డి నో చెప్పడానికి ఛాన్స్ కూడా లేదు. అందుకే వెంటనే ఆమె కూడా ఒప్పుకుంది. దాంతో పబ్‌లో చూసిన అమ్మాయితోనే తర్వాత ఏడడుగులు నడిచి ఇప్పుడు ఫారెన్ టూర్స్ కూడా వెళ్తున్నాడు. ఏదేమైనా కొన్నేళ్ళ ప్రేమకథ తర్వాతే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Allu Arjun Wife Sneha Reddy, Telugu Cinema, Tollywood