బుల్లితెరపై ఉన్న మోస్ట్ క్రేజీ టాక్ షోలలో అలీతో సరదాగా కూడా ఉంటుంది. కమెడియన్ అలీ దీనికి హోస్టుగా ఉన్నాడు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరు సెలబ్రిటీస్ ఈ షోకు వస్తుంటారు. పైగా అలీ సీనియర్ కమెడియన్ కావడంతో అందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా చాలా ఈజీగా అడిగేస్తుంటాడు. ముఖ్యంగా పాత వాళ్లు వచ్చినపుడు అభిమానులు బాగా ఆసక్తిగా చూస్తుంటారు ఎపిసోడ్స్. గత ఐదేళ్లుగా ఈ షో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. ఇప్పటికీ అవుతుంది కూడా. అయితే కోవిడ్ కారణంగా ఈ మధ్య గెస్టులను పిలవడం కూడా చాలా కష్టం అవుతుంది అందరికీ. అలీతో సరదాగా మాత్రమే కాదు.. మిగిలిన షోలకు కూడా ఎవరూ సెలబ్రిటీస్ రావడం లేదు. గెస్టులను పట్టుకోవడం మేనేజర్స్‌కు కూడా తలకు మించిన భారంగా మారుతుంది. అయితే చాలా మందిలో కొన్ని అనుమానాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ షోకు వచ్చే వాళ్లు ఫ్రీగా వస్తారా లేదంటే వాళ్లకు డబ్బులు ఇస్తారా అని. ఎందుకంటే చాలా మంది ప్రముఖులు ఈ షోకు వస్తుంటారు. వాళ్లకు కూడా ఎపిసోడ్‌కు ఇంత అని ఇస్తుంటారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఇదే టాపిక్ వినిపిస్తుంది. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన అలీతో సరదాగా షోకు వచ్చే అతిథులకు ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు ఇస్తారని తెలుస్తుంది. రేంజ్‌ను బట్టి వాళ్లకు ఫ్లైట్ టికెట్.. హోటల్ ఖర్చులు అదనం. ప్రత్యేకంగా వాళ్లను తీసుకొచ్చి షో పూర్తయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుని పంపిస్తారు.

అలీతో సరదాగా (alitho saradaga show/ETV)
వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరికీ ఎపిసోడ్‌కు లక్ష వరకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. కొత్త సినిమాలు విడుదలైనపుడు మాత్రం ప్రమోషన్ కోసం వస్తుంటారు. మిగిలిన సమయాల్లో మాత్రం వాళ్లకు డబ్బులిచ్చి తీసుకొస్తారు. ఈ షోలో ప్రమోషన్ కోసం వచ్చేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎక్కువగా ఓల్డ్ సెలబ్రిటీస్‌ను తీసుకొస్తుంటారు. పాత వాళ్లను తీసుకొచ్చి వాళ్ల నుంచి ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుంటాడు అలీ. ఈ మధ్య సుధాచంద్రన్, కోట, బాబు మోహన్, జాకీ, హరిత, అన్నపూర్ణమ్మ, వై విజయ లాంటి వాళ్లే ఎక్కువగా వచ్చారు. ఈ వారం కూడా మధుమిత, బిగ్ బాస్ 1 విన్నర్ శివబాలాజీ వస్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 17, 2021, 14:45 IST