Anna Raghu, Guntur, News18
టాలీవుడ్ (Tollywood)మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరున్న అక్కినేని నాగచైతన్య, సమంత (Nagachaitanya-Samantha) విడిపోయిన సంగతి తెలిసిందే. శనివారం ఇద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. పదేళ్ల ప్రేమ, నాలుగేళ్ల వైవాహిక బంధానికి ఈ స్టార్ జంట వీడ్కోలు పలికింది.తమ బంధానికి వీడ్కోలు పలికినట్లు ఇద్దరూ వేర్వేరుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా నాగచైతన్య-సమంత విడాకుల గురించే చర్చ జరుగుతోంది. వీరు విడిపోవడానికి కారణాలేంటి..? ప్రేమించి పెళ్లిచేసుకున్న జంటకు ఎక్కడ చెడింది. అనేదానిపైనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే విడాకుల ప్రకటన తర్వాత సమంత ఏం చేశారు..? ఎక్కడనున్నారు..? అనేదానిపై చర్చ జరిగింది..? చై నుంచి విడిపోతున్న ప్రకటన చేసిన రోజు కూడా సమంత షూటింగ్ లో పాల్గొన్నారట.
తాము విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత.. వెంటనే తన ప్రొఫెషన్ లైఫ్ లోకి అడుగిపెట్టేసింది. హైదరాబాద్ లో జరిగిన ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ ఆమె పాల్గొన్నారు. ఓల్డ్ సిటీలోని నిజాం కాలంనాటి పురాతన ముఖరంజా జూనియర్ కాలేజీ, స్కూల్ భవనాల్లో జరిగిన షూటింగ్ లో సమంత పాల్గొన్నారు. షూటింగ్ కు సమంతతో పాటు పలువురు మోడల్స్ కూడా హాజరయ్యారు. ముంబైకు చెందిన యాడ్ ఫిల్మ్ మేకర్ విశేష్ వర్మ డైరెక్షన్లో యాడ్ షూటింగ్ జరుగుతోంది.
కొన్ని రోజులుగా యాడ్ షూటింగ్ కొనసాగుతుండగా.. విడాకుల ప్రకటన చేయడంతో ఆమె షూటింగ్ కు వస్తారా..? రారా..? అని యూనిట్ ఆందోళన చెందగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆమె సెట్ కు వచ్చినట్లు తెలుస్తోంది. షాట్ పూర్తైన తర్వాత కన్నీరు పెట్టుకంటూ ఆవేదన చెందిన ఆమె.. కెమెరా ముందుకు రాగానే మళ్లీ మామూలు ఉంటూ సంతోషంగా షూటింగ్ లో పాల్గొన్నారట. షూట్ లో పాల్గొంత సేపు మౌనంగా ఉన్న సమంత ఎవరిని కలవటానికి ఇష్టపడలేదు.
దుఃఖంతో ఉంటూ మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకుంటున్న సమంతను చూసిన యూనిట్ ఈ పరిస్థితులలో పూర్తిచేయగలదా అని అనుమానంతో ఉన్నారట. కెమెరా ముందుకు వచ్చే సమయానికి కూడా గంభీరంగా ఉన్నా సమంత దర్శకుడు యాక్షన్ చెప్పగానే దర్శకునికి కావలసిన విధంగా నటించినట్లు టాక్. జీవితంలో బాధను కలిగించే సమయంలోనూ సమంత మాత్రం హుందాగా వ్యవహరిస్తూ షూటింగ్ లో పాల్గొందని అక్కడున్న నటులు, ఇతర సిబ్బంది అనుకున్నట్లు టాక్.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ డైరెక్షన్లో తెలుగు శాకుంతలం సినిమా చేస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తవగా.. కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు సైన్ చేయలేదు. మరోవైపు నాగచైతన్య లవ్ స్టోరీ ఇటీవలే రిలీజ్ అవగా.. త్వరలోనే కొత్త మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. మరోవైపు ఈ స్టార్ జోడీ విడాకులకు కారణాలేంటనేదానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni samantha, Naga Chaitanya Samantha Divorce, Nagachaithanya akkineni