HOME »NEWS »MOVIE »interesting facts about vijay pet cat in master film mnj

Vijay Master: విజయ్ మాస్టర్‌లో కీలకమైన‌ పిల్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు

Vijay Master: విజయ్ మాస్టర్‌లో కీలకమైన‌ పిల్లి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు
విజయ్ మాస్టర్ మూవీ(File Photo)

త‌మిళ‌నాట ఎంతోమంది సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తోన్న త‌రుణం వ‌చ్చేసింది. స్టార్ హీరో విజ‌య్(Vijay), విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి(Vijay Sethupathi) ప్ర‌ధాన పాత్ర‌ల్లో లోకేష్ క‌న‌గ‌రాజు(Lokesh Kanagaraju) తెర‌కెక్కించిన మాస్ట‌ర్(Master) థియేట‌ర్ల‌లోకి వచ్చేసింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    Vijay Master: త‌మిళ‌నాట ఎంతోమంది సినీ ప్రేక్ష‌కులు ఎదురుచూస్తోన్న త‌రుణం వ‌చ్చేసింది. స్టార్ హీరో విజ‌య్, విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో లోకేష్ క‌న‌గ‌రాజు తెర‌కెక్కించిన మాస్ట‌ర్ థియేట‌ర్ల‌లోకి వచ్చేసింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇక విజ‌య్‌కు ఉన్న క్రేజ్‌తో బాక్సాఫీస్ వద్ద కూడా మాస్ట‌ర్ చెల‌రేగిపోతున్నాడు. 50శాతం ఆక్యుపెన్సీ ఉన్న‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్ల‌లోనూ స‌త్తా చాటుతున్నాడు విజ‌య్. ఈ మూవీ విడుద‌ల‌కు ముందే ఎంతో హైప్ ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో ఎలా ఉంటుందో అని అంద‌రూ అనుకున్న‌ప్ప‌టికీ.. అంద‌రి అంచ‌నాల‌ను బ్రేక్ చేసి మాస్ట‌ర్ దూసుకుపోతున్నాడు.

    కాగా ఈ మూవీ చూసిన వారంద‌రికీ ఇందులో పిల్లి గురించి తెలిసే ఉంటుంది. మాస్ట‌ర్‌లో విజ‌య్ పెంపుడు జంతువుగా ఉండే ఈ పిల్లి.. చాలా కీల‌క స‌న్నివేశాల్లోనూ క‌నిపించింది. అంతేకాదు ఆ మ‌ధ్య‌న ఈ పిల్లితో విజ‌య్ సేతుప‌తి కూడా ఓ ఫొటోకు ఫోజిచ్చారు. ఇక సినిమా విడుద‌లైన త‌రువాత ఈ పిల్లి గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిని చూపుతున్నారు.




    ఈ నేప‌థ్యంలో ఈ పిల్లి గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎక్సాటిక్ బ్రీడ్ త‌రువాత ఈ ప‌ర్షియ‌న్ పిల్లికి మంచి డిమాండ్ ఉంటుందట‌. ఇది 16 శ‌తాబ్దంలో ఇటలీ నుంచి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీని విలువ కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుందట‌.


    చిన్న పిల్ల అయితే 10 నుంచి 20వేలు ప‌లుకుతుంద‌ని.. అదే కొంచెం పెద్ద పిల్లి 25 నుంచి 30 వేల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని టాక్. ఏదేమైనా విజ‌య్ సినిమా చూసిన త‌రువాత చాలా మంది ఈ పిల్లిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published:January 15, 2021, 20:20 IST

    टॉप स्टोरीज