#HBDPriyamani : ఉత్తమ నటి ప్రియమణి గురించి ఈ విషయాలు తెలుసా..

#HappyBirthdayPriyamani : ప్రియమణి ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: June 4, 2020, 11:20 AM IST
#HBDPriyamani : ఉత్తమ నటి ప్రియమణి గురించి ఈ విషయాలు తెలుసా..
విరాట పర్వం, నారప్పలో ప్రియమణి లుక్స్.. Photo : Twitter
  • Share this:
#HappyBirthdayPriyamani : ప్రియమణి ఎవరే అతగాడు (2003) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జగపతి బాబు హీరోగా వచ్చిన 'పెళ్లైన కొత్తలో' సినిమాతో తెలుగువారికి మరింత పరిచయమైంది. ప్రియమణి తమిళ సినిమా పరుత్తివీరన్‌‌లో ఫీమేల్ లీడ్‌‌గా కార్తీ సరసన నటించి జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'యమదొంగ' సినిమా ద్వారా మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు మరింత పాపులర్ అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్ తరువాత చాలా చిత్రాల్లో ఆమె నటించింది. ప్రియమణి ఇటు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లో నటించి తన అందచందాలతో పాటు నటనతో మంచిపేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు ప్రియమణి పూర్తిపేరు ప్రియ వాసుదేవ మణి అయ్యర్. అయితే స్క్రీన్ పేరును ఆమె ప్రియమణిగా మార్చుకుంది. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. వెంకటేష్ హీరోగా తమిళ హిట్ సినిమా అసురన్‌కు రీమేక్‌గా వస్తోన్న నారప్పలో ప్రియమణి కీలకరోల్‌లో కనిపించనుంది. ఈ చిత్రంతో పాటు ప్రియమణి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా వేణు ఊడుగుల దర్శకత్వలో తెరకెక్కుతున్న విరాట పర్వంలో కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది. ఈ రోజు ప్రియమణి తన 36వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విరాట పర్వం సినిమాలో తన పాత్రకు సంబందించిన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆ లుక్‌లో ప్రియమణి ఓ తుపాకీ పట్టుకుని హుషారుగా కనిపిస్తోంది. ఇక ప్రియమణి ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వివిధ రకాల రియాలీటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది.



First published: June 4, 2020, 11:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading