రష్మి గౌతమ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. కానీ ఒకప్పుడు ఒక్క అవకాశం అంటూ చెప్పులరిగేలా తిరిగింది ఈ జబర్దస్త్ బ్యూటీ. సినిమాల్లో ఏ ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని ఆఫర్స్ ఇచ్చింది. దాసరి లాంటి దర్శకుడి సినిమాలో నటించిన తర్వాత కూడా రష్మిని తెలుగు దర్శక నిర్మాతలు పట్టించుకోలేదు. 10 ఏళ్ల పాటు నరకం చూసింది. ఏ ఆఫీస్ పడితే ఆ ఆఫీస్‌కు వెళ్లి ఫోటోలు ఇవ్వడమే కాకుండా ఆడిషన్స్ కూడా చేసింది. హోలీ, కరెంట్ లాంటి సినిమాల్లో నటించినా రష్మికి పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఆమెకు అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షోలో హోస్టింగ్ చేసే అవకాశం వచ్చింది.
అనసూయ గర్భం దాల్చడంతో కొన్ని వారాల పాటు ఆమె తప్పుకోవడంతో రష్మి గౌతమ్‌కు కలిసొచ్చింది. దాంతో అలా ఆమెకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయిపోయింది. ఆ రోజు మొదలైన రష్మి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జబర్దస్త్ షోలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని హాట్ షోతో మతులు చెడగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అనసూయ రీ ఎంట్రీ ఇచ్చినా కూడా అప్పటికే పాతుకుపోయింది. సుడిగాలి సుధీర్‌తో ఈమె కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది.
తెలుగులో నటించిన తర్వాత అప్పట్లో ఓ తమిళ సినిమాలో కూడా నటించింది రష్మి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అయినా కూడా ఆమెకు అక్కడ గుర్తింపు రాలేదు. వరసగా హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో నటించిన రష్మి గౌతమ్.. జబర్దస్త్ తర్వాత హీరోయిన్‌గా ప్రమోషన్ అందుకుంది. అప్పట్నుంచి డబ్బులకే తన ప్రాముఖ్యత అని చెప్పింది రష్మి. తనకు హీరోయిన్ అవకాశాలు వచ్చినపుడు నటించడంలో తప్పేం లేదు.. డబ్బులు వస్తున్నపుడు గ్లామర్ షో చేయడంలో తప్పేం లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ గ్లామర్ షోలో రష్మిని మించిన వాళ్లు లేరేమో అనేంతగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood