సినీ నటుడు నందమూరి తారకరత్న మరణానంతరం పరిణామాలు మారుతూ ఉన్నాయి. రాజకీయంగా ఎదగాలనుకున్న హీరో హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. తారకరత్న (Tarakaratna)నందమూరి ఫ్యామిలీకి టీడీపీకి చెందిన వ్యక్తి కావడం..ఆయన భార్య అలేఖ్యరెడ్డి వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు కావడంతో అప్పటి వరకు భిన్నదృవాలుగా ఉన్న విజయసాయిరెడ్డి(Vijaya sai reddy),చంద్రబాబు(Chandrababu)తారకరత్న ఫ్యామిలీకి అండగా ఉండేందుకు కలిశారు. వీరిద్దరూ కలిసే తారకరత్న అంతిమ సంస్కారాలు దగ్గరుండి జరిపించారు. ఈ పరిణామం అటు టీడీపీ, ఇటు వైసీపీ శ్రేణులకు అంతగా రుచించకపోయినప్పటికి వీరి కలయికను చాలా మంది హర్షించారు. వారు తీసుకున్న స్టెప్ మంచిదనని భావించారు. ఇదంతా ఇప్పటి వరకు జరిగింది. తారకరత్న ఫ్యామిలీకి సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన ఈ ఇద్దరు రాజకీయ నాయకులపై ఎలాంటి విమర్శలు రాలేదు. తాజాగా విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ(Balakrishna)కలుసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
మొన్న బాబుతో వైసీపీ ఎంపీ మాట మంచి..
తారకరత్న మరణానంతరం జరుగుతున్న పరిణామాల్లో భాగంగానే ఈసారి విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి ఆయన బాగోగులు చూస్తున్న బాలకృష్ణను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతగానో అభినందించారు. ఆయన చూపించిన చొరవ, తీసుకుంటున్న శ్రద్ద చూసి కృతజ్ఞతలు కూడా తెలిపారు. తాజాగా మార్చి 2న తారకరత్న పెద్దకర్మ నిర్వహిస్తున్నారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో జరుగనున్న ఈకార్యక్రమానికి రావాలంటూ ఆహ్వాన పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్లు కలిసి ఉండటంపై మళ్లీ పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది.
రేపు బాలయ్యతో విజయసాయిరెడ్డి..
తారకరత్న తరపున బాలకృష్ణ పెద్దగా వ్యవహరిస్తుండగా..అలేఖ్యరెడ్డి తరపున విజయసాయిరెడ్డి బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిపరిణామంగా కనిపిస్తోంది. తారకరత్న ప్రేమ పెళ్లిని అంగీకరించని నందమూరి ఫ్యామిలీ..అతని మరణం తర్వాత ఫ్యామిలీని చేరదిస్తామన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పెద్ద కర్మ కూడా బాలకృష్ణ, విజయసాయిరెడ్డి లు ఇద్దరూ కలిపి చేస్తూ ఉండటం పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం అని చెప్పడమే. రాజకీయ విభేదాలు ఎన్ని వున్నా, తన కుటుంబం, తన మనుషుల కోసం ఇలా ఇద్దరూ కలవటం ఒక శుభ పరిణామంగానే చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nandamuri balakrishna, Taraka Ratna, Tollywood actor, Vijayasai reddy