INTERESTING DISCUSSION GOING ON JABARDASTH JUDGES NAGA BABU AND ROJA WILL THEY WIN IN AP ELECTIONS 2019 PK
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నాగబాబు, రోజా భవితవ్యం.. క్షణక్షణం భయం భయం..
నాగబాబు రోజా
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో సినిమా వాళ్లు తక్కువగానే పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి రోజా.. జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరికి చిన్న కో ఇన్సిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అనే కార్యక్రమం ఈ ఇద్దర్నీ చేరువ చేసింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో సినిమా వాళ్లు తక్కువగానే పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి రోజా.. జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరికి చిన్న కో ఇన్సిడెన్స్ కూడా ఉంది. ఎందుకంటే జబర్దస్త్ అనే కార్యక్రమం ఈ ఇద్దర్నీ చేరువ చేసింది. దాంతో వీళ్ల ఎన్నికల ఫలితాలపై టీవీ ఇండస్ట్రీ కూడా ఆసక్తిగానే చూస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ తప్పుకోవడంతో జబర్దస్త్ రేటింగ్స్ దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. ఇలాంటి సమయంలో నాగబాబు, రోజా మళ్లీ వెనక్కి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
రోజా, నాగబాబు
దానికి తోడు ఫలితాలు తేలే సమయం కూడా దగ్గరికి రావడంతో నాగబాబు, రోజా అభిమానుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతుంది. అసలు ఈ ఇద్దరూ గెలుస్తారా లేదా అనే ఆసక్తి ఇప్పుడు అందర్లోనూ కనిపిస్తుంది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం.. వినిపిస్తున్న వార్తలు.. చేసిన సర్వేలను బట్టి చూస్తుంటే జబర్దస్త్ జడ్జిలకు గెలుపు అంత ఈజీగా ఏం వచ్చేలా కనిపించడం లేదు. ఇద్దరికీ ప్రతికూల వాతావరణం బాగానే కనిపిస్తుంది.
తమ్ముడి పార్టీలో నాగబాబు
ముఖ్యంగా రోజా ఈ సారి గెలిస్తే మంత్రి అవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో నగరిలో ఈమె గెలుపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అక్కడ రోజాకు ఈ సారి ప్రజలు షాక్ ఇస్తారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లోనే చాలా తక్కువ మెజారిటీతో బయటపడింది రోజా. ఈ సారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ అందర్లోనూ ఉంది. మరోవైపు సొంత పార్టీలో కూడా రోజాకు మంత్రి పదవి రావడం ఇష్టం లేని కొందరు నేతలు ఆమె ఓటమి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సంచలన కథనాలు కూడా బయటికి వస్తున్నాయి.
రోజా ఫైల్ ఫోటో
ఇక ఈమె పరిస్థితి ఇలా ఉంటే నాగబాబు పరిస్థితి మరోలా ఉంది. ఈయన జనసేన నుంచి నరసాపురం ఎంపీ సీట్ కోసం పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అండ చూసుకుని ఎన్నికల్లోకి వచ్చిన మెగా బ్రదర్.. గెలుస్తాడా లేదా అనేది మాత్రం అనుమానంగా మారింది. పైగా అక్కడ వైసీపీ అభ్యర్థికి బలం ఎక్కువగా ఉండటంతో నాగబాబు గెలుపు అంత సులువు కాదేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నాగబాబు మాత్రం నరసాపురంలో నేను గెలవడం ఖాయం.. పార్లమెంట్ గడప తొక్కడం ఖాయం రాసిపెట్టుకోండి అంటూ సవాల్ చేస్తున్నాడు.
నాగబాబు రోజా
ఒకవేళ ఇద్దరూ గెలిస్తే నో ప్రాబ్లమ్.. హాయిగా ఒకరు అసెంబ్లీ.. మరొకరు పార్లమెంట్లో ఐదేళ్లు సెటిల్ అయిపోవచ్చు. అలా కాదని ఏదైనా తేడా జరిగితే మాత్రం మళ్లీ జబర్దస్త్ షోలో కలిసి కనిపించొచ్చు. మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు మిగిలిన అందరి ఫలితాల కంటే కూడా టీవీ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ ఇద్దరి భవిష్యత్తు గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. చూడాలిక ఏం జరగబోతుందో..?
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.